Home » శంకర్ మూవీలో రామ్ చరణ్ పాత్రల పేర్లు ఇవే..!

శంకర్ మూవీలో రామ్ చరణ్ పాత్రల పేర్లు ఇవే..!

by Anji
Ad

మోస్ట్ క్రేజీయెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ఒకటి. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడనే విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ శంకర్ దర్శకతంలో తెరకెక్కిన ఒకే ఒక్కడు సినిమా మాదిరిగా ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. తాజాగా హైదరాబాద్ లో జరుగుతుందని సమాచారం.

Advertisement

అయితే గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. తండ్రి కొడుకుల పాత్రలు కాగా.. ఆ పాత్రల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఈ చిత్రంలో కొడుకు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ పాత్ర పేరు రామ్ నందన్ కుమార్. ఈ పాత్రలో రామ్ చరణ్ ఓ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తాజాగా రెండు పాత్ర పేరు కూడా బయటికీ వచ్చింది. రామ్ నందన్ తండ్రి అయినటువంటి ఆ పాత్ర పేరు అప్పన్న అని.. ఆ పాత్రలో రామ్ చరణ్ ఓ రాజకీయనాయకుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. 

Advertisement

ఇక వార్త తెలిసినప్పటికీ నుంచి రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ, అంజలి నటించగా.. శ్రీకాంత్, ఎస్.జే.సూర్య, సునీల్, సముద్ర ఖని, ప్రియదర్శి, రాజీవ్ కనకాల, జయరాం, నవీన్ చంద్ర, నాజర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ఈ మూవీపై అంచనాలను రెట్టింపు చేయగా.. టీజర్ రిలీజ్ కోసం అభిమానులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఫ్రెండ్ షిప్ డే గురించి హీరోయిన్ కీర్తి సురేష్ ఏమన్నారో తెలుసా ?

Savitri : మహానటి సావిత్రిని ఆర్థికంగా దెబ్బతీసిన చిత్రం ఏదో తెలుసా..!

Visitors Are Also Reading