Home » చిరంజీవిని ఒకప్పుడు తిట్టినోళ్లే తరువాత సిగ్గుతో తలదించుకుంటారు.. ఎందుకో తెలుసా ?

చిరంజీవిని ఒకప్పుడు తిట్టినోళ్లే తరువాత సిగ్గుతో తలదించుకుంటారు.. ఎందుకో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు పద్మవిభూషణ్ అందుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కించిన నటులలో చిరంజీవి ముందుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.  ఇప్పటికీ ఈ హీరో అదిరిపోయే స్టెప్పులు, ఫైట్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.  మంచి కథలతో సినిమాలు తీస్తూ హిట్స్ అందుకుంటున్నాడు.

Advertisement

మెగాస్టార్ విశేషమైన సేవలందిస్తున్నాడు.. కాబట్టే ఆయన పట్ల సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయ వేత్తల వరకు అందరూ గౌరవం చూపిస్తారు. కానీ యండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవి పై అనవసరంగా నోరు పారేసుకున్నారు. చిరంజీవి మాత్రం ఎవ్వరూ ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. తనని మాటలన్న వారిని క్షమించి, అవకాశాలను కూడా అందిస్తుంటాడు. రామ్ చరణ్ ని తిట్టిన యండమూరి వీరేంద్ర నాథ్ కే బయోపిక్ రాసే అవకాశం ఇచ్చి తన గొప్ప మనస్తత్వాన్ని చిరంజీవి చాటుకున్నాడు. అప్పుడే యండమూరికి చిరంజీవి గొప్పతనం గురించి తెలిసింది.

Advertisement

యండమూరినే కాదు.. చిరంజీవి మంచి మనస్తత్వాన్ని మళ్లీ అర్థం చేసుకొని అతని వద్దకు వచ్చి పశ్చాత్తాప భావాన్ని వ్యక్తం చేసిన వారు మరికొందరూ ఉన్నారు. వారిలో ఒకరు చిన్ని కృష్ణ చిరంజీవి ఇంద్ర మూవీకి కథ రచయితగా పని చేశాడు. గత ఏడాది ఏదో కారణం వల్ల చిరంజీవిపై దుర్బాషలాడాడు చిన్ని కృష్ణ. ఇటీవల చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడంతో అభినందనలు తెలిపేందుకు ప్రత్యక్షంగా వచ్చి కలిశాడు. చిరంజీవిని అనవసరంగా తిట్టానని.. తాను చాలా మంచి వాడని.. కొంత మంది తన చేత చిరంజీవిని తిట్టించేలా చేశారని తెలిపాడు రచయిత చిన్ని కృష్ణ. తాను గతంలో అలా మాట్లాడినందుకు క్షమించమని కోరాడు. ఇంటికి వెళ్లితే.. చిరంజీవి కొంచెం కూడా ద్వేషం చూపించలేదని..  అది ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. 

మరోవైపు గరికపాటి నరసింహారావు కూడా చిరంజీవి ఫొటోలు సెషన్ ఆపేస్తే బాగుంటుందని.. లేదంటే మైకు వదిలేసి ప్రసంగాన్ని ఆపేస్తానని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తరువాత మళ్లీ ఉన్నత వ్యక్తిత్వం ఉన్న చిరంజీవిని అలా అనాల్సి ఉండకూడదని.. దానికి తాను శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే.. చిరంజీవి శత్రువులను సైతం సిగ్గుతో తలదించుకునేలా చేస్తారనే చెప్పుకోవచ్చు.

 

 

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading