Home » ఆస్కార్ వేదికపై తెలుగు పదాలు వినిపించడం అద్భుతమంటున్న చిరంజీవి..!

ఆస్కార్ వేదికపై తెలుగు పదాలు వినిపించడం అద్భుతమంటున్న చిరంజీవి..!

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం భారతీయ సినిమాను ఓ మెట్టు పైకి ఎక్కించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకర్షించి కేవలం కలెక్లన్ల పరంగా కాకుండా అవార్డులతోనూ మెప్పించింది ఈ చిత్రం. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వేదికగా సగర్వంగా చాటింది. 

Also Read :  నాని సినిమా పై జరుగుతున్న కుట్ర ఇదేనా ? సినిమా కలెక్షన్స్ ఆపడానికి….!

Advertisement

ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి ఆస్కార్ దక్కడంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.ఈ  నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి రచయిత చంద్రబోస్ ను ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళాశంకర్ సెట్ లోకి చంద్రబోస్ ఆస్కార్ తో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా చిరంజీవి చంద్రబోస్ కి శాలువా కప్పి సత్కారం చేశాడు. చంద్రబోస్ ఆస్కార్ ని చిరంజీవికి అందించగా.. గర్వంగా పైకి ఎత్తారు చిరు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి చిరంజీవి తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. 

Advertisement

Also Read : ముకేశ్ అంబానికి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా ?

Manam News

ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. 95 ఏళ్ల చరిత్రలో ఆస్కార్ వేదికపై తెలుగు పదాలు వినిపించడం అద్భుతమైన అనుభూతిని కలిగించింది అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. మొన్నటి మొన్న రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలో రాజమౌళి, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కార్తికేయలను కూడా చిరంజీవి సన్మానించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న భోళా శంకర్ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయనున్నారు.  

Also Read :  ఆ హీరోయిన్‌ తో నాగ చైతన్య రిలేషన్‌…ఇలా అడ్డంగా దొరికిపోయారుగా!

Visitors Are Also Reading