Home » సినిమా చూస్తున్న చిరంజీవిని ఆ స్టార్ హీరో కార్ డ్రైవర్ పక్కకెళ్ళమని అరిచాడు ! నేడు ‘పద్మవిభూషణ్’ నే గెలిచాడు !

సినిమా చూస్తున్న చిరంజీవిని ఆ స్టార్ హీరో కార్ డ్రైవర్ పక్కకెళ్ళమని అరిచాడు ! నేడు ‘పద్మవిభూషణ్’ నే గెలిచాడు !

by Anji
Published: Last Updated on

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలు తీస్తూ మంచి సక్సెస్ సాధిస్తున్నారు. ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డు అందుకొని యావత్ భారతీయుల శుభాకాంక్షలు చెప్పించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అంతకు ముందు పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నాడు.  అయితే మెగాస్టార్ జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాల గురించి  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

chiru

 

చిరంజీవి తొలినాళ్లలో పలువురు హీరోయిన్లు కూడా ఆయనను పక్కకు కూర్చొనివ్వని సందర్భాలు చాలానే ఉన్నాయి. తోటి నటుల ఎటకారాలు, నిర్మాతల అవమానాలను భరించారు. విజేతకు నిజమైన నిర్వచనం చిరంజీవి అనే చెప్పవచ్చు. చిరంజీవికి పుట్టినప్పుడు  తాత పేరు కలిసి వస్తుందని శివ శంకర వరప్రసాద్ అని నామకరణం చేశారు. రికార్డింగ్ డ్యాన్స్ ఎక్కడ వేస్తే అక్కడికీ చిరంజీవి వెళ్లిపోయేవారట. చిరంజీవి తండ్రి పోలీస్ కావాలనుకున్నాడట. తల్లి డాక్టర్ కావాలనుకుందట. చిరంజీవికి మాత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్ లా హీరో కావాలనే కోరిక.  చిరంజీవి నటుడు అవుతానని బలంగా వాదించడంతో తండ్రి చెన్నై వెళ్లేందుకు  అనుమతించాడు. శిక్షణ తీసుకునే సమయంలో సుధాకర్, హరిప్రసాద్ తో కలిసి ఉండేవారు.

అయితే ఒక రోజు జోరుగా వర్షం కురుస్తుంది. హరిప్రసాద్, చిరంజీవి ఎంజీఆర్ కటౌట్ కింద నిలబడ్డారు. ఇది చూసిన చిరంజీవి.. మనం కూడా స్టార్స్ అయితే ఇలాంటి కటౌట్స్ పెడతారా..? అని హరిని అడిగాడట.  ఛాన్స్  తప్పకుండా పెడతారని చెప్పాడట హరిప్రసాద్.  శిక్షణ సమయంలో పూర్ణ సంస్థ చేసే సినిమాలకు రివ్యూలు చెప్పాలని సినిమా వేసేవారు. వారింట్లోనే ఉండటంతో ఓ రోజు సినిమాకి వెళ్లారు. అయితే ఒక పెద్ద హీరో డ్రైవర్.. అతని మేకప్ మేన్ లు వచ్చి చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ లను లేపారు. ఇవి మాకు రిజర్వ్ చేసిన సీట్లు అని చెప్పారు. పక్కన నిలబడమని చెప్పారట. దీంతో కోపం వచ్చినా సరే ఆ డోర్ దగ్గరే సినిమా మొత్తం చూశారు. ఇంటికి రాగానే సినిమా ఎలా ఉందని.. ప్రసాద్ ని అడిగారట ఆ సంస్థ యజమాని భార్య. మీరు చెప్పారని వెళ్లాం.. కానీ మీ హీరో డ్రైవర్ మమ్మల్ని అవమానించాడు. మీ మొహం చూసి వదిలిపెట్టాం. లేకపోతే మమ్మల్నీ మధ్యలో లేపేస్తాడా..? నెంబర్ వన్ హీరో కాకుండా నేను చెన్నై నుంచి వెళ్లను. ఇది నా ఛాలెంజ్ ఆంటీ రాసిపెట్టుకోండి అని చెప్పాడట చిరంజీవి.  ఆయన చెప్పినట్టుగానే అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు.  ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ నెంబర్ వన్ హీరో అయ్యాడు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading