Home » Ram Charan – Upasana : రాంచరణ్ కూతురు పేరు ‘క్లింకారా కొణిదెల’ అసలు ఈ పేరుకి అర్థం ఏమిటంటే!

Ram Charan – Upasana : రాంచరణ్ కూతురు పేరు ‘క్లింకారా కొణిదెల’ అసలు ఈ పేరుకి అర్థం ఏమిటంటే!

by Bunty
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా కోడలు ఉపాసన ఇటీవల కాలంలోనే వీరిద్దరూ తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఈనెల 20వ తేదీన మెగా కోడలు ఉపాసన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో… పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది మెగా కోడలు ఉపాసన. దీంతో మెగా కుటుంబంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.

Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసనల వివాహం జరిగి దాదాపు 11 సంవత్సరాలు దాటింది. 11 సంవత్సరాల తర్వాత మెగా వారసురాలు పుట్టడంతో… మెగాస్టార్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇది ఇలా ఉండగా తాజాగా రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతుల కుమార్తెకు ఇవాళ నామకరణం చేశారు. ఉపాసన మరియు రామ్ చరణ్ దంపతుల కుమార్తెకు క్లిన్ కార కొణిదెల అనే పేరును పెట్టారు మెగా కుటుంబ సభ్యులు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ మరియు ఉపాసన తెలిపారు.

Advertisement

ఇదంతా పక్కకు పెడితే రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతుల కుమార్తెకు క్లిన్ కార కొణిదెల అనే పేరు పెట్టడంతో అందరూ దాని అర్థం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్లిన్ కార అంటే అర్థం లలిత సహస్రనామాలలో బీజాక్షరం అన్న మాట. ప్రకృతి శక్తికి ప్రతిరూపం. ఆధ్యాత్మికతను పెంపొందించేలా శక్తిని శుద్ధి చేస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా ఉపాసన డెలివరీ ఖర్చులకోసం ఏకంగా కోటిన్నర రూపాయలు అయ్యాయట. ఆ డబ్బులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Visitors Are Also Reading