Home » విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తున్న గాడ్ ఫాథర్..!

విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తున్న గాడ్ ఫాథర్..!

by Azhar
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు రీమేక్స్ తో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యే చిరు హీరోగా వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ ఐన విషయం అందరికి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇనాక్ ఇందులో రామ్ చరణ్ కూడా ఉండటంతో.. ఆచార్య సూపర్ హిట్ అనుకుంటే.. సూపర్ తుస్ అనిపించింది. అందుకే మెగాస్టార్ తన తర్వాతి సినిమాల పైన దృష్టి పెడుతున్నాడు.
ఇక ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాథర్ అనే సినిమా కూడా ఉంది. మలయాళంలో స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫర్. ఈ సినిమాను మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేసి మెగాస్టార్ చేయబోతున్నారు. అయితే మొత్తం పాలిటిక్స్ చుట్టూ తిరిగే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తు వస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి అభిమానులకు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
అదేంటంటే.. ఈ సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ అనేది ప్రారంభించింది. తాజాగా ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ అనేవి అమ్ముడయ్యాయి. భారీ ధరకు ఓ ప్రముఖ సంస్థ  ఈ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఉన్న క్రేజ్ తో చాలా మంది ఈ సినిమా గురించి వెట్ చేస్తున్నారు. అయితే రేపు సాయంత్రం 5.45 ఈ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ అనేది విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినది. చూడాలి మరి రేపు విడుదలవబోతున్న లుక్ లో చిరు ఫ్యాన్స్ కు ఎలా దర్శనం ఇవ్వబోతున్నాడు అనేది.
Visitors Are Also Reading