Home » మెగా 156 ప్రారంభం.. అభిమానులను అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి

మెగా 156 ప్రారంభం.. అభిమానులను అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా ఎదిగారు. అయితే మెగా 157 ప్రాజెక్టు కాస్త నెంబర్ మారి మెగా 156 గా మారిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. బింబిసార మూవీ తో అటు చిత్ర పరిశ్రమ ఇటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వశిష్ట. తన రెండవ చిత్రంని ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇటీవల నిర్వహించిన సైమా వేడుకల్లో ఉత్తమ పరిచయ దర్శకుడిగా బింబిసార మూవీతో వశిష్ట అవార్డు అందుకున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రధాన టీమ్ ను ఓ వీడియో ద్వారా యూవీ క్రియేషన్స్ మేకర్స్ ప్రకటించారు.

Advertisement

అందులో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణితో వీడియో ప్రారంభం అవుతుంది. ఇక ఆపై మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సినిమాకు కెమెరా మాన్ గా చోటా కె నాయుడు వ్యవహరిస్తున్నారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని కీరవాణి తెలిపారు. కాస్ట్ సుస్మిత కొణిదెలా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వంటి వారు మెగా 156 ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ని కూడా ప్రకటించనున్నారు.

Advertisement

ఈ చిత్రం నుంచి ఇప్పటికే కాన్సెప్ట్  లాంఛ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని చాలా రోజుల క్రితమే అప్డేట్ అందించారు. మీ అందరికీ సినిమాటిక్ అడ్వెంచర్ ను అందించడానికి మేమంతా సిద్ధం.. అంటూ డైరెక్టర్ వశిష్ట సినిమా అనౌన్స్ మెంట్ నుంచి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు.  ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ లో ఎవరు కనిపించబోతున్నారనేది త్వరలో క్లారిటీ రానుంది. మరోవైపు చిరంజీవి బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్  కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ చిత్రానికి సైన్ చేశాడని తెలిసిందే. 

మరికొన్ని సినిమా వార్తలు ఇప్పుడు మనం చూద్దాం.

Visitors Are Also Reading