సాధారణంగా అభద్రత భావం కెరీర్ ఏమైపోతుందోననే భయం ప్రతీ వ్యక్తిలో ఉంటుంది. సినిమా స్టార్స్ కి ఇందులో మినహాయింపు ఏమి లేదు. ఎందుకంటే ప్రతీ శుక్రవారం ఆయా హీరోల జాతకాలు మారిపోతుంటాయి. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో ఉన్న హీరోలకు అభద్రత భావం భయం మరింత ఎక్కువ అనే చెప్పాలి. సినిమా అనేది కళల మాయ ప్రపంచం. ఒక్క మాటలో చెప్పాలంటే కళలను అమ్ముకునే బేకారులు వాళ్లు. అయినా వారిలో అభద్రత భావం తప్పనిసరి.
Advertisement
ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. సినీ పరిశ్రమ గురించి, నటుల విషాద గాథల గురించి ఎంతో విన్న చిరంజీవి తన కెరీర్ ని అతి జాగ్రత్తగా భయంతో ప్రారంభించారు. ప్రారంభంలో తగిన గుర్తింపు, సరైన వేషాలు లభించక నిరాశ, నిస్పృహలు కలిగిన జనం పాండి బజార్ లో ఎక్కువగా ఉంటారని ఆయన వినేవారు. అలాంటి వ్యక్తులను చూసినా, కలిసినా తాను కూడా మానసికంగా బాధపడాల్సి వస్తుందేమోననే భయంతో చిరంజీవి పాండిబజార్ వైపు తొంగి చూసేవారు కాదు. ఒక ఆర్టిస్ట్ గా ఎదగాలంటే నటితో పాటు ప్రవర్తన కూడా అతి ముఖ్యం. అది తెలుసుకొని సినీ ఇండస్ట్రీలో పెద్దవారితో గౌరవంగా ఉండటం నేర్చుకున్నాడు చిరంజీవి. పారితోషికం గురించి ఆయనకు పెద్ద పట్టింపు ఉండదు. ఇస్తానన్న పారితోషికం ఇవ్వకుండా 2వేలు చేతిలో పెట్టి ఉంచవయ్యా అని నిర్మాత అంటే.. మారు మాట్లాడకుండా తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. డబ్బు గురించి పట్టించుకోకుండా నిర్మాతలు ఇచ్చింది తీసుకునేవారు. ఇటువంటి భయాలతో చిరంజీవి కెరీర్ కొనసాగుతుండగా.. ఒకరోజు సత్య చిత్ర ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఆఫీస్ కి రమ్మని చెప్పారు. ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన సూర్యనారాయణ చిరంజీవితో మాట్లాడారు.
Advertisement
సూపర్ స్టార్ కృష్ణతో కొత్త అల్లుడు అనే చిత్రం తీస్తున్నారు. అందులో విలన్ వేషం వేయాలని పేర్కొన్నారు. ఇందులో కైకాల సత్యనారాయణ మెయిన్ విలన్ అని చెప్పారు. ఆ సమయంలోనే చిరంజీవి ఆరని మంటలు, ఊరికిచ్చిన మాట సినిమాల్లో హీరోగా నటించారు చిరంజీవి. అందుకే మొహమాటంగా ఇప్పుడు విలన్ వేషాలు వేయడం లేదని చెప్పాడు. అయినా సూర్యనారాయణ చిరంజీవిని వదిలిపెట్టలేదట. దీంతో చిరంజీవి ఒప్పుకుని కొత్త అల్లుడు సినిమాను పూర్తి చేశారట. ఇక ఆ తరువాత మళ్లీ హీరో కృష్ణతోనే కొత్తపేట రౌడీ చిత్రం ప్రారంభించారు సత్యనారాయణ, సూర్యనారాయణ. ఇందులో చిరంజీవికి ఓ గెస్ట్ రోల్ చేయమన్నారు. మరోవైపు చిరంజీవిని హీరోగా పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఏంటండి.. గెస్ట్ రోల్, విలన్ గా నటిస్తే మా సినిమాలను జనాలు చూస్తారా అని ప్రశ్నించారట.
వారికి మెగాస్టార్ నచ్చజెప్పారట. చిరంజీవికి అవకాశం ఇస్తానని సూర్యనారాయణ మోసం చేశారట. ఇండస్ట్రీలో చాలా మందిప్రారంభంలో ఇబ్బందులు పడ్డా.. ఎదిగే కొద్ది మంచి పేరు తెచ్చుకొని విజయాలను సాధించి తరువాత చిరంజీవిలో అభద్రత భావం పోయి తన మీద తనకు నమ్మకం, విశ్వాసం పెరిగాయి. 47 ఏళ్ల నటన, 154 చిత్రాల అనుభవం.. ఆయనను మెగాస్టార్ గా నిలబెట్టాయి. తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ రికార్డులను సృష్టిస్తున్నారు. 67 వయస్సులో కూడా ఎంతో హుషారుగా నటిస్తున్న చిరంజీవిని చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు.. ఆగస్టు 11న భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ కలెక్షన్స్ పై కాజోల్ ఆసక్తికర కామెంట్స్.. వీడియో వైరల్..!
వైష్ణవి చైతన్య తన కెరియర్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!