Home » Chiranjeevi: మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- రామ్ చరణ్..!

Chiranjeevi: మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- రామ్ చరణ్..!

by Bunty
Ad

 

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరి కాంబోలో సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. కానీ అది కొంతవరకు మాత్రమే. ఇద్దరూ స్క్రీన్ పై కనిపించడం జరిగింది. కానీ ఫుల్ స్పేస్ వచ్చేలా ఓ సినిమాని ప్లాన్ చేశారట బుచ్చిబాబు. ఈసారి కాంబినేషన్ ఆచార్య మాదిరిగా ఉండకుండా చాలా కొత్తగా చూపించే ప్రయత్నంలో ఉన్నారట బుచ్చిబాబు.

chiranjeevi and ram charan

chiranjeevi and ram charan

ఆచార్య సినిమాలో వీరిద్దరూ కలిసి మెప్పించారు. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆచార్య సినిమాలో చిరంజీవి గురువు పాత్రలో కనిపించారు. ఈసారి కూడా బుచ్చిబాబు చూపించే పాత్ర కూడా అలాంటిదేనట. ఈ మూవీలో కూడా చిరంజీవి గురువు పాత్రలో కనిపించబోతున్నారట. రామ్ చరణ్ కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేశారట బుచ్చిబాబు. ఈ కథలో రాంచరణ్ మోటివేట్ చేసే గురువు పాత్రలో చిరంజీవి కనిపించనున్నారట.

Advertisement

Advertisement

ఇక వీరు చేసే మరో సినిమాతో ఆచార్య తాలూకు చేదు జ్ఞాపకాలన్నీ తొలగిపోతాయట. ప్రస్తుతం రామ్ చరణ్… గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది క్లారిటీ లేదు. ఇక రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈసారైనా వీరిద్దరి కాంబోలో సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.

 

ఇవి కూడా చదవండి

Jasprit Bumrah: తండ్రైన బుమ్రా.. కుమారుడి పేరేంటో తెలుసా!

ఏం పీ***టారో పీక్కోండి.. పవన్ కల్యాణ్ పై హీరోయిన్ మాధవి సంచలన వ్యాఖ్యలు !

తన అసిస్టెంట్ పెళ్లికి రష్మిక ఆర్థిక సాయం… ఆశీర్వాదం ఇచ్చి మరి !

Visitors Are Also Reading