Home » క‌రోనా కొత్త వేరియంట్ విజృంభ‌ణ‌..మ‌ళ్లీ చైనాలో లాక్‌డౌన్‌..!

క‌రోనా కొత్త వేరియంట్ విజృంభ‌ణ‌..మ‌ళ్లీ చైనాలో లాక్‌డౌన్‌..!

by Anji
Ad

క‌రోనా వైర‌స్ గ‌త రెండేళ్లుగా యావ‌త్ ప్ర‌పంచాన్ని వివిధ వేరియంట్‌ల రూపంలో వెంటాడుతూనే ఉన్న‌ది. నూత‌న వేరియంట్‌ల రూపంలో విజృంభిస్తూ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి పుట్టినిల్లును క‌నుగొన‌డంలో శాస్త్రవేత్త‌లు విఫ‌లమ‌య్యారు. అయితే చాలా మంది చైనా దేశాన్ని క‌రోనా పుట్టినిల్లుగా భావిస్తున్నారు. తాజాగా చైనాలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్య న‌గ‌ర‌మైన చాంగ్‌చున్‌లో క‌రోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండ‌డంతో శుక్ర‌వారం అక్క‌డ లాక్‌డౌన్ విధించారు.

Advertisement

Advertisement

ఫ‌లితంగా 90 ల‌క్ష‌ల మంది ఉన్న ఆ న‌గ‌రంలో ప్ర‌స్తుతం క‌ఠిన ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండ‌డంతోనే లాక్‌డౌన్‌ను విధించిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. కాగా స్థానికులు ఇండ్ల నుంచి అస్స‌లు బ‌య‌టికి రావొద్దు అని ఆదేశించారు. నిత్యావ‌స‌రాల కోసం రెండు రోజుల‌కు ఒక‌సారి ఇంటి నుంచి ఒక‌రు మాత్ర‌మే బ‌య‌ట‌కొచ్చి తీసుకోవాల‌ని తెలిపారు. న‌గ‌రంలోని ప్ర‌జ‌లు మూడు సార్లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌న్నారు. అత్య‌వ‌స‌రం కాని సేవ‌ల‌ను ర‌ద్దు చేశారు. ట్రాస్న్ పోర్ట్ లింకుల‌ను కూడా మూసేశారు.

Also Read :  లీట‌ర్ పెట్రోల్ పై రూ.50 పెంపు.. ఎక్క‌డో తెలుసా..?

Visitors Are Also Reading