Home » రికార్డు స్థాయిలో చికెన్ ధ‌ర.. ఏపీలో కేజీ చికెన్ ధ‌ర‌ ఎంతంటే..?

రికార్డు స్థాయిలో చికెన్ ధ‌ర.. ఏపీలో కేజీ చికెన్ ధ‌ర‌ ఎంతంటే..?

by Anji
Ad

వేస‌వి కాలం ప్రారంభమైన‌ప్ప‌టి నుంచే క్ర‌మ‌కమంగా చికెన్ ధ‌ర పెరుగుతూ వ‌చ్చింది. గ‌తంలో వేస‌వి కాలం వ‌చ్చిందంటే ఎండకు కోళ్లు త‌ట్టుకోలేవ‌ని.. బ‌ర్డ్ ప్లూ వంటి వైర‌స్ కార‌ణంగా చికెన్ ధ‌ర త‌గ్గుతుండేది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా రికార్డు స్థాయిలో ధ‌ర ప‌ల‌క‌డం విశేషం. ఏపీలో గురువారం నాటికి చికెన్ ధ‌ర అత్య‌ధికంగా పెరిగింది. ప్ర‌ధానంగా విశాఖ‌ప‌ట్నంలో అయితే చికెన్ ఆల్‌టైమ్ రికార్డును న‌మోదు చేసింది. స్కిల్ లెస్ చికెన్ కిలో ధ‌ర రూ.312గా నిర్ణ‌యించారు.

Advertisement

కోళ్ల ప‌రిశ్ర‌మ వ‌ద్ద ఉన్న రికార్డుల ప్ర‌కారం.. ఇప్ప‌టివ‌ర‌కు గ‌రిష్ట ధ‌ర రూ.290. ప్ర‌స్తుతం ఆ రికార్డును క్రాస్ చేసి స‌రికొత్త రికార్డు సృష్టించింద‌నే చెప్పాలి. మే 01న రూ.238 ఉన్న చికెన్ కేవ‌లం ప‌ది రోజుల్లోనే రూ.74 పెరిగి రూ.312కు చేరుకున్న‌ది. రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసిన నేప‌థ్యంలో ఎండ‌ల తీవ్ర‌త ఇంకా త‌గ్గ‌క‌పోవ‌డం, పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల రాబోయే రోజుల్లో చికెన్ ధ‌ర‌లు మ‌రింత పెరుగుతాయ‌ని వ్యాపారులు పేర్కొంటున్నారు. మార్కెట్ డిమాండ్ కు స‌రిపడ‌నంత చికెన్ లేనందు వ‌ల్ల‌నే ప‌ది రోజుల నుంచి ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని వారు పేర్కొంటున్నారు.

Advertisement


ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచే ఎండ‌లు పెరిగి ఏప్రిల్ 01 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు వ‌డ‌గాలులు వీచాయి. గాలిలో తేమ శాతం త‌గ్గ‌డం, వ‌ర్షాలు లేక‌పోవ‌డంతో వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఇది కోళ్ల ఎదుగుద‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. మేత త‌క్కువ‌గా తిని, ఎక్కువ‌గా నీళ్ల‌పై ఆధార‌ప‌డ‌డంతో కోళ్లు ఆశించిన బ‌రువు పెర‌గ‌లేదు. వేస‌విలో 45 రోజుల‌కు స‌గ‌టున కోడి రెండు కేజీలు అవుతుంది. ఇప్పుడు అది కిలోన్న‌ర కూడా రావ‌డం లేద‌ని.. ఫారంలో ఉంచితే ఎండ‌కు చ‌నిపోతాయ‌నే భ‌యంతో వెంట‌నే అమ్మేస్తున్నార‌ని తెలుస్తోంది.


ముఖ్యంగా వేస‌వికాలం కావ‌డంతో కూర‌గాయ‌ల దిగుబడులు త‌గ్గ‌డం, హోట‌ళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్ల‌లో వ్యాపారాలు జోరు అందుకోవ‌డం చికెన్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు ఓ కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. విశాఖ జిల్లాలో ఆదివారం 7 ల‌క్ష‌ల కిలోలు అమ్మితే మిగిలిన రోజుల్లో స‌గ‌టున 3 నుంచి మూడున్న‌ర లక్ష‌ల కిలోల కోడిమాంసం అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని.. అందుకు త‌గ్గ‌ట్టుగా ఫారాల్లో కోళ్లు లేవు. మ‌రొక వైపు ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు కోళ్ల ప‌రిశ్ర‌మ‌లో కంపెనీల గుత్తాధిప‌త్య‌మే కార‌ణం అని కొంద‌రు రైతులు వాదిస్తున్నారు. కోళ్ల ప‌రిశ్ర‌మ‌లో 80 నుంచి 85 శాతం వాటా కంపెనీల‌దేన‌ని.. మిగిలిన 15-20 శాతం వ‌ర‌కు మాత్ర‌మే రైతులు ఉన్న‌ట్టు స‌మాచారం.

Also Read : 

బ్రతికుండగానే ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కథ రాసుకున్న ఈవివి సత్యనారాయణ..!

సమంత పర్సనల్ లైఫ్ పై లేడీ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు…!

Visitors Are Also Reading