Home » బ్రతికుండగానే ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కథ రాసుకున్న ఈవివి సత్యనారాయణ..!

బ్రతికుండగానే ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కథ రాసుకున్న ఈవివి సత్యనారాయణ..!

by AJAY
Published: Last Updated on
Ad

ఈవీవీ సత్యనారాయణ…టాలీవుడ్ లో ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఈవీవీ కామెడీ చిత్రాలతో తన మార్క్ ను వేసుకున్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఈవీవీ సినిమా వచ్చిందంటే హ్యాపీగా నవ్వుకుని ఆ కష్టాలను మర్చిపోవచ్చు అని ప్రేక్షకులు భావించేవారు. అయితే ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాల్సి వుండగానే ఈవీవీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

Advertisement

అయితే ఆయన చనిపోకముందే కొన్ని సినిమాలకు సీక్వెల్ లు కూడా రాసుకున్నారట. ఈ విషయాన్ని ఆయన కుమారుడు హీరో అల్లరి నరేష్ చెప్పారు. అల్లరి నరేష్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి నిన్నటితో 20 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ…..మా నాన్న కు కామెడీ అంటే చాలా ఇష్టం. ఎంతో మంది కమెడియన్ లను, హాస్య రచయితలను ఆయన ప్రోత్సహించారు.

Advertisement

ఆయన చనిపోవడానికి కొంత కాలం ముందు రాసుకున్న కథలు ..అనుకున్న టైటిల్స్ ఇప్పటికీ మా ఇంట్లో పదిలంగా ఉన్నాయి. అవి చూసినప్పుడల్లా మనసుకు బాధ కలుగుతుంది. నాన్న కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో అలిబాబా అరడజను దొంగలు కూడా అఒకటి. కాగా నాన్న ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని అనుకున్నారు. అంతే కాకుండా కథ కూడా రాసుకున్నారు. కానీ నాన్న అనుకున్నట్టు సీక్వెల్ చేయడం కష్టమే అంటూ నరేష్ ఎమోషనల్ అయ్యారు.

 

Also read :

సమంత పర్సనల్ లైఫ్ పై లేడీ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు…!

Visitors Are Also Reading