Home » ఛార్మి వల్లే పూరి లాస్ అవుతున్నారా.. ఆమెను వదిలేస్తే తప్ప సక్సెస్ రాదంటూ నెటిజన్ల కామెంట్స్..!!

ఛార్మి వల్లే పూరి లాస్ అవుతున్నారా.. ఆమెను వదిలేస్తే తప్ప సక్సెస్ రాదంటూ నెటిజన్ల కామెంట్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొన్ని రోజులుగా చార్మి మరియు పూరి జగన్నాథ్ కలిసి పూరి కనెక్ట్ బ్యానర్ పై నిర్మాణ భాగస్వామిగా చేస్తున్నారు. ఈ బ్యానర్ పై మొదట తెరకెక్కిన సినిమా జ్యోతిలక్ష్మి.. ఈ బ్యానర్ పై వచ్చిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా తప్ప అన్ని డిజాస్టర్ గానే మిగిలాయి. దీంతో పూరి జగన్నాథ్ ఆస్తులు అన్ని కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది. ఈ తరుణంలోనే ఇస్మార్ట్ శంకర్ విజయంతో వారు కోల్పోయిన ఆస్తులను మళ్ళీ సంపాదించుకున్నారు. ఇదే ఊపుతో మళ్లీ లైగర్ సినిమాను తెరకెక్కించారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ మూవీకి చార్మి నిర్మాణ భాగస్వామిగా బాధ్యతలు తీసుకుంది. అందుకే సినిమా ప్రమోషన్లో ఛార్మి హడావిడి చేసింది అని చెప్పవచ్చు.

Advertisement

also read:ఈ 5ల‌క్ష‌ణాలు ఉన్న స్త్రీల‌కు పురుషులు వెంట‌నే అట్రాక్ట్ అవుతార‌ట‌…? 3వ‌ది ముఖ్య‌మైనది.!

Advertisement

ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ విజయ్ బంగారుకొండ అని, పూరీ సెన్సేషనల్ డైరెక్టర్ అంటూ గొప్పలు చెప్పింది. మూవీ హిట్ అయితే మరో విధంగా ఉండేది కానీ లైగర్ చిత్రం దారుణంగా విఫలమవడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూరి నువ్వు ఎంత సేపు ఛార్మీ ధ్యాసలోనే బతికితే చివరికి జనాలు నిన్ను డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపోతారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్. అసలు ఛార్మి వల్ల పూరికి ఒరిగిందేమిటి అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఒకరిపై ఒకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదంటున్నారు. చార్మి ని నువ్వు వదిలేస్తే కానీ దారిలోకి రావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఛార్మి తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించిన పూరికి అంత లాసే వచ్చింది.

అలాగే పూరి మరియు చార్మి కనెక్ట్ బ్యానర్ మీద జనగణమన మూవీ కూడా తెరకెక్కుతోంది. ప్రస్తుతం పూరి లైగర్ మూవీ టీజర్ కి ఎక్కువ ట్రైలర్ కి తక్కువ అని ప్రేక్షకులు అంటున్నారు.. ఈ ప్రభావం జనగణమన మీద కూడా పడే అవకాశం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎన్నో సక్సెస్ సినిమాలను పరిచయం చేసిన పూరి జగన్నాథ్, ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నారని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఛార్మీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయాన్ని పూరి ఎప్పుడూ గమనిస్తారో అంటూ నెటిజన్స్ వాపోతున్నారు.

also read:లైగర్ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా…? మామూలు రాడ్ సీన్ కాదుగా…!

Visitors Are Also Reading