Home » CHANDRAMUKHI REAL STORY: చంద్రముఖి రాజుని చంపిందెవరు.. అసలు కథేంటంటే..?

CHANDRAMUKHI REAL STORY: చంద్రముఖి రాజుని చంపిందెవరు.. అసలు కథేంటంటే..?

by Sravanthi
Ad

కేరళలోని అలా కుల జిల్లా అలమట్టి పట్టణంలో ఒక పెద్ద ఇల్లు ఉంది.దాని చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్. అది చూడగానే జమీందార్ల ఇల్లు లా కనిపిస్తుంది. ఇది ట్రావెన్ కోర్ రాజ్యంలోని ఒక పిల్ల జమిందార్ ఇల్లు. అతనిది కూడా ట్రావెన్కోర్ వంశమే. అలమోట్టిల్ మెద రాజు.. మహా క్రూరుడు.. అతని ఇంటి కింది భాగంలో చుట్టాలు మరియు ఇతర బంధువులు ఉండేవారు. పైన రాజు ఉండేవారు. బ్రిటిష్ వారి కింద ఉంటూ వారికి పన్నూ కడుతూ ఈ ప్రాంతాన్ని ఏలుతుండేవాడు రాజు. అతని ఇంటికి దూరంగా పనిచేసే వారి కోసం ప్రత్యేకమైన టువంటి గదులు కూడా ఉండేవి. ఇక ఇంటికి కాస్త దూరం లో తన ఉంపుడుగత్తెలను ఒక ప్రత్యేకమైన చిన్న ఇల్లు కూడా ఉండేది. ఆ రాజు తన ఇంట్లో నుంచి చూస్తే తన కోసం తీసుకువచ్చిన అందగత్తెలు కనిపించేలా అందులో ఉంచేవారు. వారిలో మంచి నాట్యకారులను కూడా పిలిచేవారు. వారికి నాట్యం చేస్తే నగలు ఇవ్వడంతోపాటు సత్కారం కూడా చేసేవాడు. అందాన్ని ఆస్వాదించడం లో ఆ రాజుది అందె వేసిన చేయి. ఇక చంద్రముఖి కథ కూడా ఇక్కడే పుట్టింది. రాజు మంచి పాలనలో ఉన్నప్పుడు తన సోదరి కుటుంబం తన ఇంటికి వచ్చింది.

Advertisement

 

ఇక తన అక్క బావ వారి పిల్లలను కూడా అదే ఆస్థానంలో ఉంచుకున్నాడు. ఇక రాజు యొక్క రాజభోగాలు సంపదను చూసి అక్క బావ కుళ్లుకున్నారు. ఆయన ఆస్తి పై కన్నేశారు.ఆయన ఆస్తులలో కొంత వాటా ఇస్తే తాము కూడా బతుకుతామని ఎన్నాళ్ళు ఇక్కడ ఉండమంటావ్ అని రాజు అక్క అడగడంతో దూరంగా ఉన్న తన పెద్ద భవనంతో పాటు 1000ఎకరాల భూమిని ఇచ్చాడు రాజు. కానీ చేతికి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక తన అక్క బావ పిల్లలు కూడా పెద్దవారయ్యారు. రాజుకు కూడా పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే రాజు వయసు మీద పడుతుండటం తో ఆస్తి వస్తుందని తన అక్క ఎదురు చూస్తూ ఉండేది. కానీ రాజు తన సంస్థ అధికారులను పిలిపించి తన ఆస్తులు మొత్తాన్ని కొడుకులకు, కూతుళ్ళకు రాసిచ్చాడు. దానిపై తన భార్య సంతకాన్ని కూడా పెట్టించాడు. ఎన్నాళ్లనుంచో కాచుకుని కూర్చున్న తన అక్క కు ఆస్తి దక్కలేదు.. దీంతో రాజును చంపేయాలనుకున్నారు. మొదట రాజు భార్యకు స్లో పాయిజన్ ఇచ్చి చంపారు.

Advertisement

ఆమెకు విషపూరిత పుట్టగొడుగులను చిన్నచిన్న ముక్కలుగా చేసి, వ్యాధి తగ్గుతుందని చెప్పి కషాయంగా తయారు చేసి ఇచ్చేవారు. ఆమె కూడా రోజు తాగేది. దీంతో మూడు నెలల తర్వాత మంచానపడి ఆమె చనిపోయింది. దీంతో రాజు ఒంటరి వాడయ్యాడు. తన తోడు ఎవరు లేకపోవడంతో తన సేవకుడి పద్దెనిమిదేళ్ళ కూతుర్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆమె రాజుని చాలా బాగా చూసుకునేది. కానీ ఓ రోజు ఒక కళాకారుడు రాజు వద్దకు వచ్చి ఆయన చిత్రం వేస్తానని చెప్పాడు. అప్పుడు రాజుతో పాటు తన పని మనిషి బొమ్మ కూడా వేయమన్నాడు రాజు. రాజు బొమ్మను రెండు రోజుల్లో వేశాడు కానీ ఆ పని మనిషి బొమ్మ వేయడానికి వారం రోజులు టైం తీసుకున్నాడు కళాకారుడు. తర్వాత పని మనిషి బొమ్మను అందంగా తీర్చి దిద్దాడు.. ఆ బొమ్మ ని చూసిన రాజుకు పనిమనిషి పై మనసు పడింది. ఇంతలోనే రాజు అక్క ఆ ఇంట్లో కి ఎంట్రీ ఇచ్చింది. పనిమనిషిపై రాజు పెంచుకున్న ప్రేమను గమనించింది.. తన గేమ్ స్టార్ట్ చేసింది.. అంతా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది.. ఎలాగైనా రాజును చంపేయాలని భావించింది..

అనుకున్న విధంగానే ఒక గదిలో రాజును, ఆ పని మనిషిని చంపేసింది.. వారి నగలు డబ్బు అంతా దోచేసి వారి సంస్థానానికి పంపింది.. ఆ తర్వాత రాజును చంపిన గది తప్ప, ఆ కోటను మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దింది.. అయితే ఆ రాజు కొడుకు కూడా ఒక సేవకున్ని ఆ ఆస్థానం లో ఉంచాడు. ప్రతి అమావాస్య రోజున అక్కడ నుండి క్రూర శబ్దాలు రావడంతో ఆ సేవకుడు ఆ కోటను వదిలి పారిపోయాడు. తర్వాత మరో సేవకుడిని రాజు కొడుకు ఉంచితే మరో అమావాస్య నాడు అలాగే అరుపులు వినపడ్డాయి ఆ సేవకుడు కూడా పారిపోయాడు.. చివరికి తన అక్కే ఆ ఇంట్లో ఉంది.. మళ్లీ అమావాస్య రానే వచ్చింది.. ఆరోజు రాత్రి తన అక్క కూతురు ఇంట్లో ఉండగానే, ఆ పని మనిషి ఆత్మ తన కూతురును ఆవహించింది.. అచ్చం పని మనిషి లాగా మాట్లాడుతూ ఆమె కూతురే ఆ రాజు అక్కను చంపేసింది. ఈ విధంగా ఆ కోట నుంచి ప్రతి అమావాస్య రోజున శబ్దాలు రావడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొనే చంద్రముఖి సినిమాను తెరకెక్కించారు.

also read:

Visitors Are Also Reading