Home » ఆ మూవీ సక్సెస్ మీట్ లో జయప్రదను దారుణంగా అవమానించిన బాలచందర్.. కారణం..?

ఆ మూవీ సక్సెస్ మీట్ లో జయప్రదను దారుణంగా అవమానించిన బాలచందర్.. కారణం..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మధ్యతరగతి జీవితాలపై సినిమా తీయడం అంటే ఆషామాషీ విషయం కాదు. మధ్యతరగతి జీవితం లో ఉన్న స్వార్థం, త్యాగం, అవసరం, అన్నింటినీ కలిపి అంతులేని కథ అనే అద్భుతమైన టైటిల్ తో 1970 వ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు బాలచందర్. ఆ సమయంలో ఆ సినిమాకి ఆ టైటిల్ చాలా సెట్ అయింది. మూవీ లో ఫైట్స్,డ్యూయెట్స్ ఏమీ లేవు. హీరో, విలన్స్ లేరు. ఈ మూవీలో కేవలం మనుషులు వారి స్వభావాలు మాత్రమే కనిపిస్తాయి. ఇందులో హీరోయిన్ పాత్ర అయితే కీలకం అని చెప్పవచ్చు. కుటుంబంలోని అందరి అవసరాలను తీర్చే సరిత పాత్రలో జయప్రద అద్భుతంగా నటించింది. దీంతో లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు సాధించింది జయప్రద.

అలాగే ఈ మూవీ లో రజినీకాంత్ మరియు కమల్ హాసన్ కూడా నటించారు. ఆ తర్వాత వీరు నటుడిగా మంచి గుర్తింపు సాధించారు. బాధ్యత లేని అన్న పాత్రలో రజనీకాంత్ నటించారు. సిగరెట్ ఎగరవేసి తాగడం అనే స్టైల్ అప్పట్లో యువతను ఎంతో ఆకట్టుకుంది. ఇందులో రజనీకాంత్ చేసిన “దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి” అనే పాట పాపులర్ అయింది. ఈ పాటని ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు కే.జే. ఏసుదాసు గారి చేత పాడించారు. ఈ మూవీలో మరో రెండు ముఖ్య పాత్రలు వికటకవి గోపాల్, అమాయకంగా ఉంటూ సరితను మూగగా ప్రేమించే పాత్ర. దీంతో ఈ సినిమా ఆ సమయంలోనే సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో నటించే నటులు అందరికీ మంచి గుర్తింపు లభించింది. ఇక జయప్రద కు అయితే ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు..

Advertisement

Advertisement

మూవీలో నటించిన నటీ నటులు అందరూ ఆ ఫంక్షన్ కి వచ్చారు. హీరోయిన్ జయప్రద మాత్రం ఈ ఫంక్షన్ కు హాజరు కాలేదు. ఎన్టీఆర్ సొంత సినిమా అయినా చాణక్యచంద్రగుప్త అనే మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతున్న సమయంలో ఆ షూటింగ్ కొరకే జయప్రద ఈ ఫంక్షన్ కు రాలేదు. ఈ విషయం బాలచందర్ కు చాలా కోపం తెప్పించింది. ఆ ఫంక్షన్ లో ప్రసంగిస్తున్న బాలచందర్ ఈ మూవీలో నటించిన హీరోయిన్ ఇప్పుడు ఫంక్షన్ కి రాకుండా మరో పెద్ద హీరో షూటింగ్ లో ఉన్నారని, నా సినిమా షూటింగ్ జరిగినంత కాలం సెట్ లో అందరికంటే ముందు ఉండే జయప్రద నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళేది కాదు. మూవీ రిలీజ్ అయింది సూపర్ హిట్ అయింది. ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. పెద్ద అయిపోయింది.. ఇక ఈ సినిమా ఫంక్షన్ కి రావడం అనవసరం అనుకుందో ఏమో.. అందుకే రాలేదు అంటూ తీవ్రంగా కోపానికి వస్తూ అవమానించారు బాలచందర్.

also read:

Visitors Are Also Reading