ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, మంచి వ్యూహకర్త. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ పలు పుస్తకాలను రచించారు. అతను చెప్పిన నీతి వ్యాఖ్యల కారణంగా కౌటిల్యుడు అనే బిరుదు కూడా వచ్చింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్యనీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంథంలో అనేక అంశాలను ఆచార్యుడు ప్రస్తావించారు. ఆయన అప్పుడు రాసిన చాణక్య నీతి ఇప్పటి ప్రజలకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా జీవితంలో విజయం సాధించాలంటే ఆర్థిక విషయాల్లో ఈ నియమాలను పాటిస్తే కోటీశ్వరులు కావచ్చని ఆచార్య చాణక్య సూచించాడు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : శ్రీదేవి కూతురు వెంట పడుతున్న ఆర్ఆర్ఆర్ హీరోలు..?
Advertisement
సాధారణంగా ప్రతీ ఒక్కరికీ ధనవంతులు కావాలనే కోరిక ఉంటుంది. డబ్బు సంపాదించేందుకు చాలా కష్టపడుతున్నారు. కష్టపడి ప్రయత్నించినా కొన్ని సార్లు మీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అప్పుల పాలు కూడా అయ్యే అవకాశం ఉంది. చాణక్యుడి కొన్నింటిని నియమాలను పాటిస్తే.. డబ్బును ఆదా చేసుకోవచ్చు. ధనవంతులు కూడా కావచ్చు. చాణక్యుడి ఆర్థిక విధానాలను పాటించడం వల్ల ఆర్థికంగా మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా చేపట్టిన పనులు కావచ్చు. వ్యాపారంలో విజయవంతమవుతారు. ఓ వ్యక్తి ధనవంతుడు కావాలంటే.. డబ్బు ఖర్చు చేయడం, పొదుపు చేసే మార్గాలను తెలుసుకోవాలని చాణక్యుడు తెలిపాడు. అవసరానికి మించి డబ్బు ఆదా చేయడం మంచిది కాదు. ఉదాహరణకు సరస్సులోని నీరు ఒకే చోట ఎక్కువ సేపు ఉంటే ఆ నీరు మురికిగా మారుతాయి.
Advertisement
ఉపయోగించుకోవడం వల్ల దాని విలువ తగ్గుతుంది. దాతృత్వం డబ్బు ఖర్చు చేయడానికి గొప్ప మార్గం. దాతృత్వం డబ్బును తగ్గించదు కానీ రెట్టింపు చేస్తుంది. డబ్బును సద్వినియోగం చేసుకోవాలని.. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. సంపాదనలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వండి. పెట్టుబడి కోసం డబ్బును ఉపయోగించాలి. నేటి నుంచి బీమా, ఆరోగ్య పథకాలు, విద్యాపథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. డబ్బుపై దురాశ, అహంకారం అస్సలు ఉండకూడదు. డబ్బుపై దురాశ ఉంటే మనిషి దారి తప్పిపోతాడు. డబ్బు సంపాదించడం కోసం ఎంతకైనా దిగడానికి సిద్ధపడుతాడు. ఈ తరహా వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. డబ్బు వచ్చినప్పుడు గర్వపడకూడదు అంటాడు చాణక్యుడు. డబ్బు ఎల్లప్పుడూ సరైన మార్గంలో సంపాదించాలి. ఎందుకు అంటే.. తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు స్వల్ప కాలిక సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది. చాణక్యుడి ప్రకారం.. అనైతిక లాభాలు త్వరగా నాశనమవుతాయి. సరైన మార్గంలోనే డబ్బు సంపాదించడం చాలా ఉత్తమం.
Also Read : Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఖర్చులు అధికం