Home » శ్రీదేవి కూతురు వెంట ప‌డుతున్న ఆర్ఆర్ఆర్ హీరోలు..?

శ్రీదేవి కూతురు వెంట ప‌డుతున్న ఆర్ఆర్ఆర్ హీరోలు..?

by AJAY
Ad

ఒక‌ప్పుడు బాలీవుడ్ సినిమా హీరోయిన్ లు టాలీవుడ్ లో సినిమాలు చేయ‌డం అంటే చాలా గ్రేట్. అలా న‌టించాలంటే భారీ రెమ్యున‌రేష‌న్ తో పాటూ గొంతెమ్మ కోరిక‌లు కోరుకునేవారు. ఎందుకంటే అప్పుడు బాలీవుడ్ పెద్ద ఇండ‌స్ట్రీ కావ‌డం వ‌ల్ల సౌత్ ను చిన్న‌చూపు చూసేవారు. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి.

Advertisement

ఇండియాలో టాలీవుడ్ టాప్ లో ఉంది. టాలీవుడ్ సినిమా అంటే పాన్ ఇండియా లెవ‌ల్ లో జ‌నాలు ఎగ‌బ‌డి చూస్తున్నారు. ఇక బాలీవుడ్ మార్కెట్ డీలా ప‌డిపోవ‌డంతో అక్క‌డి హీరోయిన్ లు కూడా టాలీవుడ్ లో సినిమాలు చేయాల‌ని ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఒక‌ప్పుడు టాలీవుడ్ ను చిన్న‌చూపు చూసిన జాహ్న‌వి క‌పూర్ ఇప్పుడు ఎన్టీఆర్ కు జోడీగా న‌టించేందుకు రెడీ అయ్యింది.

Advertisement

ఎన్టీఆర్ కొర‌టాల కాంబినేష‌న్ లో ఈ అమ్మ‌డిని ఫిక్స్ చేయ‌గా ఇప్పటికే జాహ్న‌వి షూటింగ్ కోసం హైద‌రాబాద్ లో కూడా లాండ్ అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వ‌క‌ముందే ఇప్పుడు చ‌బ్బీ గ‌ర్స్ కు మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టుగా టాక్ వినిపిస్తుంది. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినిమాలో అత‌డితో జోడీ క‌ట్టేందుకు జాహ్న‌విని ఫిక్స్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రామ్ చ‌ర‌ణ్ బుచ్చిబాబు కాంబినేష‌న్ లో ఓ సినిమాను అనుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంద‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమా అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చింది. కాగా ఈ సినిమా కోసం మేక‌ర్స్ జాహ్నవిని సంప్ర‌దించార‌ట‌. జాహ్న‌వి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని స‌మాచారం.

ALSO READ : చార్మినార్ వ‌ద్ద షాపింగ్ చేసిన ఎన్టీఆర్ భార్య‌…ఆమె సింప్లిసిటీకి నెటిజ‌న్ లు ఫిదా..!

Visitors Are Also Reading