ఆచార్య చాణక్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినఅవసరమే లేదు. సామాజిక జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను అద్భుతంగా చెప్పారు. అప్పట్లో ఆయన చెప్పిన విషయాలనే ప్రస్తుతం ఎక్కువ ఆచరిస్తున్నారు. చాణక్యుడు తన రాజనీతిశాస్త్రంలో జీవితంలో ప్రతీ విషయానికి సంబంధించిన పలు కీలక సూచనలు చేశాడు చాణక్య. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం లో ఏం చేయాలి. ఏం చేయకూడదు ? జీవిత విధానం ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి? ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాలను వివరంగా వెల్లడించారు.
Advertisement
ప్రధానంగా యువత జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం వివాహ సమయం. పెళ్లి సమయంలో తీసుకునే నిర్ణయాలను బట్టి భవిష్యత్ లో భార్య భర్తల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆధారపడి ఉంటుందని చాణక్య చెప్పాడు. ఆచార్య చాణక్య ప్రకారం.. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలలో కూడా కొన్ని లక్షణాలుంటాయి. అవి ఎల్లప్పుడూ వైవాహిక జీవితాన్ని చాలా బిజీగా ఉంచుతాయి. ఈ లక్షణాలు ఏంటో వీటి గురించి తెలుసుకుందాం.
ఎప్పుడూ సంతోషంగా ఉండే వారు.. :
Advertisement
పెళ్లి అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం. వివాహం విషయంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. తృప్తి చెండం, ఉన్నదానితో సర్దుకుపోవడం, ప్రవర్తనలో స్థిరత్వం ఉంటుందో వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి. ఆడపిల్లలలో అబ్బాయిలు, అత్యాశ భావం ఉంటే అది వారి జీవితంపైనే దుష్ప్రబావం చూపుతుంది. అత్యాశ లేని ఆడపిల్లలు భర్తకే కాదు. కుటుంబానికి కూడా మేలు చేస్తారు. పూర్వకాలంలో స్త్రీలు సహనంతో వైవాహిక జీవితాన్ని గడపడానికి ప్రయత్నించే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు.
కోపాన్ని నియత్రించుకునే సార్థ్యం :
సాధారణంగా కోపం అనేది ప్రతీ వ్యక్తి జీవితంలో డార్క్ మార్క్ ఇది ఏ సంబంధాన్ని అయినా క్షణికావేశంలో నాశనం చేస్తుంది. కోపం కారణంగా పెద్ద పెద్ద సామ్రాజ్యాలే ధ్వంసం అయినట్టు చరిత్ర పేర్కొంటుంది. తమ కోపాన్ని అదుపులో ఉంచుకునే సామర్థ్యం ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు. అలాంటి వ్యక్తులతో సంబంధాన్నితప్పకుండా కలుపుకోవచ్చు.
ఓదార్పు ఉన్నవారు :
ప్రతీ వ్యక్తి తన జీవిత భాగస్వామి ఇలా ఉండాలని భావిస్తుంటారు. కష్టమైనా, సుఖమైనా, దు:ఖమైనా ప్రతి సందర్భంలోనూ తనకు అండగా నిలుస్తారని ఆశిస్తారు. మీరు వివాహం చేసుకోబోయే అమ్మాయిలో ఈ లక్షణం తప్పకుండా ఉన్నట్టయితే వారిని పెళ్లి చేసుకోవడంలో సంకోచించకూడదు.
Also Read : ప్రతి రోజూ ఇలా స్కిప్పింగ్ చేస్తే త్వరగా బరువు తగ్గొచ్చు..!