Home » చాణక్య నీతి: భర్తలు తమ భార్యలకు ఈ 4 విషయాలు అస్సలు చెప్పకూడదు!

చాణక్య నీతి: భర్తలు తమ భార్యలకు ఈ 4 విషయాలు అస్సలు చెప్పకూడదు!

by Srilakshmi Bharathi

చాణక్యుడి గురించి నేటి తరానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తరతరాలుగా ఆయన రచించిన అర్ధశాస్త్రంలోని మెళకువలను నేటికీ మనం నేర్చుకుంటున్నాం. కేవలం అర్ధ శాస్త్రం మాత్రమే కాదు బ్రతకడానికి అవసరమైన ఎన్నో జీవిత సత్యాలను కూడా చాణుక్యుడు వివరించాడు. చాణుక్యుడు చెప్పిన నీతి వాక్యాలన్నీ ప్రస్తుతం చాణక్య నీతి అన్న గ్రంధం ద్వారా నేటి తరానికి చేరుతున్నాయి.

chanakya new

లోకజ్ఞానం గురించి చాలా సూక్తులు చెప్పిన చాణుక్యుడు భర్తలకు కొన్ని నీతి వాక్యాలను కూడా చెప్పాడు. ఏ భర్త అయినా, తన భార్యకు ఈ నాలుగు విషయాల గురించి అస్సలు చెప్పకూడదని హితవు పలికాడు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఏ భర్త అయినా, తనకు ఎంత ఆదాయం వస్తుంది అన్న విషయాన్నీ తన భార్యకి చెప్పకూడదని అన్నాడు. అలా చెప్తే ఇంట్లో అనవసర ఖర్చులు పెరుగుతాయని, ఒక్కోసారి ఇంట్లో ఖర్చు భర్త సంపాదనకు మించి ఉంటుందని చెప్పారు.

ఇంకా భర్తలు తమ బలహీనతల గురించి భార్యలకు చెప్పకూడదట. భార్యలు తరచూ వాటి గురించి ప్రస్తావిస్తే భర్తల్లో ఆత్మనూన్యతా భావం మరింత పెరుగుతుందట. అందుకే అస్సలు చెప్పకూడదట. అలాగే తనకు జరిగిన అవమానాల గురించి కూడా భర్తలు తమ భార్యలకు చెప్పకూడదట. ఒకవేళ చెప్పినా, భార్య వద్ద కూడా ఆ విషయమై అవమానాన్ని పొందాల్సి వస్తుందట. అలాగే ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే.. ఆ విషయాన్నీ కూడా భర్తకు చెప్పకూడదట. ఒకవేళ భార్య అడ్డుపడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్నీ కూడా భార్యలకు చెప్పకూడదట.

మరిన్ని ముఖ్య వార్తలు:

చాణక్య నీతి: ఏ విషయాలను మనం రహస్యంగా ఉంచుకోవాలి తెలుసా?

చాణక్య నీతి: ఈ 8 మందికి ఇతరుల బాధ ఎప్పటికీ అర్ధం కాదు!

చాణక్య నీతి : ఈ ముగ్గురికి అస్సలు సాయం చేయకూడదట..!!

 

Visitors Are Also Reading