Home » సుధీర్ ర‌ష్మి మ‌ధ్య‌లో ఏముంది..జ‌బ‌ర్ద‌స్త్ నిజాలు బ‌య‌టపెట్టిన చ‌మ్మ‌క్ చంద్ర‌..!

సుధీర్ ర‌ష్మి మ‌ధ్య‌లో ఏముంది..జ‌బ‌ర్ద‌స్త్ నిజాలు బ‌య‌టపెట్టిన చ‌మ్మ‌క్ చంద్ర‌..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ల‌వ్ స్టోరీలు పెరిగిపోయాయి. అయితే అందులో నిజ‌మైన ల‌వ్ స్టోరీలు మాత్రం చాలా తక్కువే. టీవీ షోల రేటింగ్ కోసం అంట‌గ‌డుతున్న రిలేష‌న్ షిప్ లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. వాళ్లిద్ద‌రి మ‌ధ్య‌న ఏదో ఉంద‌ని క్రియేట్ చేయ‌గానే ప్రేక్ష‌కుల‌కు ఇంట్రెస్ట్ పెరిగిపోయి షోల రేటింగ్ కూడా అమాంతం పెరిగిపోతుంది. అయితే అలాంటి కాన్స‌ప్ట్ మొద‌ట‌గా బుల్లి తెర‌పై క్రియేట్ అయ్యింది మాత్రం ర‌ష్మి మ‌రియు సుధీర్ మ‌ధ్య‌నే…వీరిద్ద‌రూ జ‌బ‌ర్ద‌స్త్ లో చేయ‌గా ఇద్ద‌రి మ‌ధ్య‌న ఏదో ఉంటంద‌టూ వార్తలు మొద‌ల‌య్యాయి.

ALSO READ : Ram Gopal varma : బిచ్చగాళ్లు అంటూ మహేష్, ప్రభాస్ పై వర్మ సెటైర్ లు…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్…!

Advertisement

sudheer

sudheer

సుధీర్ స్టేటిపై ర‌ష్మిపై జోకులు చేయ‌డం ర‌ష్మి కూడా సుధీర్ పై జోకులు వేయడం. ఇద్ద‌రి వాల‌కం చూస్తే ఏదో ఉన్న‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డంతో చాలా మంది ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే అనుకుంటారు. అయితే తాజాగా ఈ విష‌యంపై జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు చ‌మ్మ‌క్ చంద్ర స్పందించాడు.

Advertisement

sudheer

sudheer

ఓ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ సుధీర్ రష్మి మ‌ధ్య ఏదో ఉందంటారు. నిజానికి ఇద్ద‌రి మ‌ధ్య ఏం ఉంది అంటూ ప్ర‌శ్నించారు. దానికి చంద్ర స‌మాధానం ఇస్తూ…ఏదో ఊరికే అండి..ఎవ‌రి లైఫ్ వాళ్ల‌కు ఉంది. షో బాండింగ్ కోస‌మే అలా చేశార‌ని చెప్పారు. స్కిట్ లో ఫ‌న్ కోస‌మే అలా చేస్తారంటూ చెప్పారు. ర‌ష్మి సుధీర్ కూడా అదే చెబుతార‌ని అన్నారు. ప్రేక్ష‌కుల్లో ఇంట్రెస్ట్ కోస‌మే అలా క్రియేట్ చేశార‌ని చెప్పారు.

Anchor Rashmi

ఇక చంద్ర జ‌బ‌ర్దస్త్ నుండి అదిరింది కామెడీ షోకు షిఫ్ట్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. కాగా త‌న‌ను ఇక్క‌డ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నార‌ని అన్నారు. న‌వ్వించే స‌త్తా ఉంటే ప్ర‌తి ఫ్యామిలీ ఎదురుచూస్తుంద‌ని అన్నారు. కామెడీ ప‌ర్ఫెక్ట్ గా చేస్తే ఏ షోను అయినా ప్రేక్ష‌కులు చూస్తార‌ని అన్నారు. అదిరిందికి వ‌చ్చిన రెస్పాన్స్ చూస్తే బాగుంద‌ని అన్నారు.

Visitors Are Also Reading