Home » Ram Gopal varma : బిచ్చగాళ్లు అంటూ మహేష్, ప్రభాస్ పై వర్మ సెటైర్ లు…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్…!

Ram Gopal varma : బిచ్చగాళ్లు అంటూ మహేష్, ప్రభాస్ పై వర్మ సెటైర్ లు…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్…!

by AJAY

సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోలు దర్శకులు ఏపీ సీఎం జగన్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం పై వర్మ తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఆర్జీవీ తన ట్వీట్ లో…. సామాన్య ప్రజల్లో భాగమైన సీఎం జగన్ మంత్రి పేర్ని నాని లు సూపర్ మెగా బాహుబలి స్టార్స్ కంటే పెద్ద స్టార్ గా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Also read : DJ TILLU REVIEW : మోత‌మోగుతున్న “డీజే టిల్లు”..సినిమా ప్ల‌స్లు మైన‌స్లు ఇవే.. !

ఎందుకంటే ముఖ్యమంత్రిని కీర్తిస్తూ ఈ బెగ్గింగ్ రియల్ స్టార్స్ ట్వీట్స్ చేశారని అన్నారు. కానీ జగన్ పేర్ని నాని మాత్రం కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదని ఆర్జీవీ కౌంటర్ వేశారు. జగన్ రియల్ మెగా సూపర్ డూపర్ స్టార్ అంటూ వార్మ ప్రశంసలు కురిపించారు. మహేష్ బాబు చిరంజీవి ప్రభాస్ తదితరులు ఒమెగాస్టార్ జగన్ చుట్టూ జూనియర్ ఆర్టిస్టుల్లా కూర్చోవడమే దీనికి ఉదాహరణ అంటూ పేర్కొన్నారు.

రియల్ ఫిల్మ్ లో మధ్యలో మహేష్ బాబు చిరంజీవి ప్రభాస్ తదితరులు పంచ్ డైలాగులు కొడుతూ ఉంటారు అని కానీ రియల్ లైఫ్ లో మధ్యలో జగన్ ఉన్నారని పేర్కొన్నారు. జగన్ కు వాళ్లంతా భయపడ్డారని…. భిక్ష కోసం జూనియర్ ఆర్టిస్టులు అడుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ స్టార్ ల కంటే ఎక్కువ అని వర్మ సెటైర్లు కురిపించారు.

Ramgopal varma

Ramgopal varma

జగన్ ను చూసి తను ఆశ్చర్యపోయానని… ఎందుకంటే సూపర్ మెగా స్టార్స్ ను అందరిని ఒక లైన్ లో కూర్చోపెట్టి హీరోలందరూ హీరోలు అని నిరూపించారని పేర్కొన్నారు. ఇక వర్మ చేసిన ట్వీట్ లపై స్టార్ హీరోల అభిమానులు మండి పడుతున్నారు. వర్మ కు సినిమాలు చేయడం చేతకాదు కానీ ఇలాంటి అనవసర టాపిక్ లు మాట్లాడటం వచ్చు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Visitors Are Also Reading