Home » కుర్చీ మడతపెట్టడం కాదు.. ఏకంగా విరగొట్టాడు.. జైస్వాల్‌ సిక్సర్‌కు ఛైర్‌ ధ్వంసం..!

కుర్చీ మడతపెట్టడం కాదు.. ఏకంగా విరగొట్టాడు.. జైస్వాల్‌ సిక్సర్‌కు ఛైర్‌ ధ్వంసం..!

by Anji
Ad

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్‌ సెంచరీ చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇంగ్లండ్‌ బౌలర్లను చితక బాదిన యశస్వి జైస్వాల్‌ 214 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ లో ఏకంగా 14 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. జేమ్స్ అండర్సన్ నుంచి మార్క్ వుడ్, టామ్ హార్ట్‌ల వరకు ఎవరిరీ విడిచిపెట్టలేదు యశస్వి. అందరి బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు.

Advertisement

రెహాన్ అహ్మద్ వేసిన 31వ ఓవర్లో యశస్వి జైస్వాల్ భారీ సిక్స్ కొట్టాడు. బంతి నేరుగా ఇంగ్లండ్ డగౌట్ కు వెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీపై పడడంతో అది కాస్తా విరిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్‌ గా మారాయి. ఇక రాజ్‌కోట్‌ టెస్టులో 434 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.  యశస్వీ జైశ్వాల్‌ సైతం అద్బుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్‌ నడ్డి విరిచిన స్పిన్నర్ రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ యశస్వి 500 పరుగులు పూర్తి చేశాడు. టెస్టు సిరీస్‌లో 500కి పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

Advertisement

అంతకు ముందు 2007లో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 534 పరుగులు చేశాడు. 557 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కేవలం 122 పరుగులకే ఆలౌటైంది. భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. అశ్విన్‌, బుమ్రా చెరో వికెట్‌ పడగొట్టారు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలోకి వెళ్లిపోయింది.  దీంతో ఇంగ్లండ్ జట్టు WTC  నుంచి ఔట్ అయిపోయింది.

Also Read : అశ్విన్ అదుర్స్.. 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు..!

Visitors Are Also Reading