యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో రాబోతున్న కొత్త చిత్రం “కళ్యాణం కమనీయం”. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రధానంగా పెళ్లి నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా “కళ్యాణం కమనీయం” జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
Advertisement
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ అందజేశారు. ఈ చిత్రాన్ని వీక్షించి.. సకుటుంబ సమేతంగా చూసే ఆహ్లాదకరమైన చిత్రమని సెన్సార్ బృందం వెల్లడించింది. మరోవైపు జనవరి 11న తమిళ హీరోలు అజిత్, తెగింపు, విజయ్ వారసుడు, జనవరి 12 న బాలయ్య వీరసింహారెడ్డి, జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య వంటి భారీ చిత్రాల మధ్యన కళ్యాణం కమనీయం అనే మూవీ విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, ఎగిరే వంటి లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది.
Advertisement
Also Read : క్యాన్సర్ నుంచి కోలుకున్న తరువాత హీరోయిన్ హంసానందిని ఎలా మారిపోయిందో చూశారా..?
కంటెంట్ ఓరియంటెడ్ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే కాన్సెప్ట్ తో రూపొందించడంతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. కుటుంబమంతా కలిసి పండగ వేళలో థియేటర్ వద్దకు వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సత్య జి ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కృష్ణ కాంత్ సాహిత్యము, కొరియోగ్రాఫర్స్ యస్ విజయ్ షోలాంకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నరసింహారాజు, డిజైనర్ రవీందర్, లయన్ ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి, సహనిర్మాత అజయ్ కుమార్, వీఆర్వో జీఎస్ కే మీడియా, నిర్మాణం యువీ క్రియేషన్స్, అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం. పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా తట్టుకుంటుందో లేదో అనేది తెలియాలంటే మాత్రం జనవరి 14 వరకు వేచి చూడాల్సిందే.
Also Read : పవన్ కళ్యాణ్ వల్ల ఉద్యోగం కోల్పోయిన అషు రెడ్డి.. వైరల్ గా మారిన పోస్ట్..!