Home » పవన్ కళ్యాణ్ వల్ల ఉద్యోగం కోల్పోయిన అషు రెడ్డి.. వైరల్ గా మారిన పోస్ట్..!

పవన్ కళ్యాణ్ వల్ల ఉద్యోగం కోల్పోయిన అషు రెడ్డి.. వైరల్ గా మారిన పోస్ట్..!

by Bunty
Ad

యాంకర్‌, బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆశు రెడ్డి తెలుగుపేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతగా ఆశు పాపులర్ అయింది. అలా సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత మెల్లిగా ఆశు రెడ్డి బుల్లితెరకు పరిచయమైంది. యాంకర్ గా పలు టీవీ షోలో చేసి అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక టాటూ ని వేయించుకుంది ఆశు. అయితే ఈమె పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా కోసం పెద్ద సాహసమే చేసిందట.

READ ALSO  : సూర్య భీకర సెంచరీ.. రికార్డులన్నీ బద్దలు! టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..!

Advertisement

2017 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా విడుదల అయింది. ఆ సమయంలో ఆశు అమెరికాలోనే డల్లాస్ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అప్పుడు డల్లాస్ లో కాటమరాయుడు ప్రీమియర్ షో చూసేందుకు సెలవు కావాలని మేనేజర్ కి మెయిల్ పెట్టిందట. ఇంకేముంది ఆ మెయిల్ వల్ల ఆశు రెడ్డి తన ఉద్యోగం కోల్పోయానని వెల్లడించింది. అలా తన ఉద్యోగం పోవడం వల్ల తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడిందని, కానీ ఏ రోజు దాని గురించి పెద్దగా బాధపడలేదని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ కి భక్తురాలు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని వెల్లడించింది. అప్పుడు ఆమె చేసిన మెయిల్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

ఆ మెయిల్ లో ఏముందంటే, “మంగళవారం రోజు నేను ఆఫీస్ కి రావచ్చు, రాకపోవచ్చు, రావాలని లేదు. ఎందుకంటే ఆ రోజు పవర్ స్టార్ సినిమా రిలీజ్ ఉంది. ప్రీమియర్ షో చూడకపోతే నాకది సిగ్గుచేటు. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒకవేళ అర్థం చేసుకోకపోతే నా ఉద్యోగం వేరొకరికి ఇచ్చినా పర్లేదు. కానీ మీరు నన్ను వదులుకోరని అనుకుంటున్నా. కృతజ్ఞతలు అశ్విని రెడ్డి” అంటూ రాసి ఉంది. ఆశు రెడ్డి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ మెయిల్ చూసిన కొంత మంది నెటిజన్లు ఈ మెయిల్ డ్రాఫ్ట్ లోనే ఉందని అంటుంటే, మరి కొంత మంది మాత్రం, అభిమానం ఉండవచ్చు కానీ ఇలా ఉద్యోగం వదులుకోవడం మంచిది కాదని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

READ ALSO : Waltair Veerayya Trailer : ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ట్రైలర్‌..అన్నయ్య వస్తే పూనకాలు, అడుగేస్తే అరాచకాలు

Visitors Are Also Reading