Home » U19 World Cup ఐదోసారి క‌ప్‌ను గెలుచుకున్న భార‌త్

U19 World Cup ఐదోసారి క‌ప్‌ను గెలుచుకున్న భార‌త్

by Anji
Ad

ఐసీసీ అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ 2022లో ఓట‌మి ఎరుగ‌ని ఏకైక జ‌ట్టుగా యువ భార‌త్ నిలిచింది. ఈ త‌రుణంలో 24 ఏళ్ల త‌రువాత ఫైన‌ల్‌కు చేరిన ఇంగ్లాండ్‌ను టైటిల్ పోర్‌లో చిత్తు చేసింది. ఇంగ్లాండ్‌తో ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ వేదిక‌గా శ‌నివారం అర్థ‌రాత్రి ముగిసిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బరిచిన యువ భార‌త్ 4 వికెట్ల తేడాతో గెలిచి ఐద‌వ సారి విశ్వ‌విజేత‌గా నిలిచింది.

Advertisement

24 ఏండ్ల త‌రువాత ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్ కు నిరాశ త‌ప్ప‌లేదు. ఆ జ‌ట్టుకు తాజాగా టోర్నీలో ఎదురైన తొలి ఓట‌మి ఇదే కాగా.. భార‌త జ‌ట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా టైటిల్‌ను గెలుపొంద‌డం గ‌మ‌నార్హం. ఇంగ్లాండ్ 1998లో ఒక్క‌సారి మాత్ర‌మే క‌ప్‌ను గెల‌వ‌గా.. భార‌త్ వ‌రుస‌గా 2000, 2008, 2012, 2018, 2022లో విజేత‌గా నిలిచింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది ఇంగ్లాండ్ జ‌ట్టు.

Also Read :  ఆ పాట కోసం….104 డిగ్రీల జ్వ‌రంతో చిరు డాన్స్

Advertisement

భార‌త బౌల‌ర్ల దెబ్బ‌కు 44.5 ఓవ‌ర్ల‌లో 189 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిపోయింది. ఆ జ‌ట్టులో ఏకంగా ఆరుగురు బౌల‌ర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే ప‌రిమితం అయ్యారు. ఇందులో ముగ్గురు డ‌కౌట్‌గా వెనుదిరిగారు. అయితే జేమ్స్ ర్యూ 116 బంతుల్లో 95 ప‌రుగులు చేయ‌డంతో 189 పురుగులు చేయ‌గ‌లిగింది. చివ‌రిలో జేమ్స్ సేల్స్ 34 పరుగులు చేశాడు. అయితే భార‌త బౌల‌ర్ల‌లో రాజ్ బ‌వాఐదు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ర‌వికుమార్ 4, కుశాల్ తంబె వికెట్ తీశారు.

190 ప‌రుగులు ఛేద‌న‌లో ఓపెన‌ర్ ర‌ఘువంశీ డ‌కౌట్‌గా వెనుదిరిగినా తెలుగు క్రికెట‌ర్‌, వైస్ కెప్టెన్ షేక్ ర‌షీద్ హాప్ సెంచ‌రి సాధించాడు. మ‌రొక ఓపెన‌ర్ హ‌ర్ నూర్ సింగ్ 21 ప‌రుగులు చేసి జ‌ట్టును న‌డిపించాడు. అత‌నితో క‌లిసి రెండ‌వ వికెట్‌కు 49 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన షేక్ ర‌షీద్ అనంత‌రం కెప్టెన్ య‌శ్‌దూల్ తో మూడ‌వ వికెట్‌కు 46 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌డంతో భార‌త జ‌ట్టు విజ‌యానికి బాట‌లు ప‌డ్డాయి. టీమ్ స్కోరు 95 వ‌ద్ద షేక్ ర‌షీద్‌, 97 వ‌ద్ద య‌శ్దూల్ ఔట‌య్యారు. నిశాంత్ సింధు 50 నాటౌట్‌, రాజ్‌బవా 35, దూకుడుగా ఆడి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. చివ‌రిలో దినేష్ బ‌నా 13 నాటౌట్ బ్యాక్ టూ బ్యాక్ సిక్స‌ర్లు కొట్టి 47.4 ఓవ‌ర్లలో 195/6 తో గెలుపొందారు.

Also Read :  BREAKING : గాన కోకిక ల‌తా మంగేష్క‌ర్ మృతి…!

Visitors Are Also Reading