ఇప్పటికే పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరియు ఇతర నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో అనేక ఇబ్బందులు పడుతున్న పేద మధ్య తరగతి కుటుంబాల పై మరో దెబ్బ పడనుంది. దీంతో బస్సులో ప్రయాణం చేయాలా వద్దా అనే కోణంలో ప్రజల ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది రోజుల నుంచి వివిధ సేవల పేరుతో టిఎస్ ఆర్టిసి బస్ చార్జీలు పెంచిన విషయం అందరికీ తెలిసిందే. శుక్రవారం మరోసారి ఛార్జీలను పెంచేసింది.
Advertisement
మరి ఈసారి బస్సు చార్జీలను కాకుండా రిజర్వేషన్ చేసుకునే టికెట్లపై ఛార్జీలను పెంచుతూ సొంత నిర్ణయం తీసుకున్నది. ఒక్కో రిజర్వేషన్ టికెట్ పై 20 రూపాయల నుంచి 30 రూపాయల మేర పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది. గత కొన్ని నెలల నుంచి పెట్రోల్, డీజిల్, సెస్ పేరిట రెండు దఫాల బస్ చార్జీలు పెంచిన విషయం అందరికి తెలిసిందే. దీనికి తోడుగా ఆర్డినరీ మరియు పల్లెవెలుగు బస్సులలో కూడా పది రూపాయల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
Advertisement
అంతేకాకుండా ఇక రిజర్వేషన్ ఛార్జీలను పెంచిన టి ఎస్ ఆర్ టి సి నిర్ణయం తీసుకోవడం పేద ప్రజల పై భారమే అంటున్నారు. చాలా మంది పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలతో సొంత వాహనాలు వదిలి బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇలా చార్జీలు పెంచితే పేద మధ్యతరగతి వారు ఎలా బతికేది అని లబోదిబోమంటున్నారు.
ఇది కూడా చదవండి:
ఊరంతా ఫ్లెక్సీలు, అధికారుల ఫోన్ నెంబర్లు.. ఆ ఊరికి వెళ్లాలంటే వణుకుతున్న అధికారులు.. ఎక్కడది..!
కేసీఆర్ కొత్త నినాదం ఏమిటో తెలుసా..?
రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులకు తీపి కబురు : సీఎం కేసీఆర్