Home » Team India : టీమిండియా కొత్త కెప్టెన్ గా బుమ్రా ?

Team India : టీమిండియా కొత్త కెప్టెన్ గా బుమ్రా ?

by Bunty
Ad

దశాబ్ద కాలంగా వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో టీమిండియాదే ఆధిపత్యం. ప్రత్యర్థులను భారత జట్టు వణికించేసింది. చైనా దేశాలకు సంబంధించి సౌతాఫ్రికాలో సిరీస్ గెలవకపోయినా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో సత్తాచాటింది. ప్రస్తుతం రోహిత్ కెప్టెన్సీలో ఆడుతుంది. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్ ను దృష్టిలో పెట్టుకొని ఆడుతుంది. అయితే కెప్టెన్సీనీ కోహ్లీ వదులుకున్న తర్వాత సెలెక్టర్లు రోహిత్ నే సారధిగా ఎంపిక చేశారు. నిజానికి హిట్ మ్యాన్ ఎంపిక తాత్కాలికమైనది. ఎందుకంటే రోహిత్ కెరియర్ క్లైమాక్స్ లో ఉంది. మరో కెప్టెన్ ను ఇప్పుడు సెలెక్టర్లు చూసుకోవాల్సిందే.

Advertisement

ప్రస్తుత డబ్ల్యూటిసి సైకిల్ ముగిసే నాటికైనా కొత్త సారధిని పట్టుకోవాల్సిందే. పూజారా, రహానే వంటి వారి కెరియర్ ముగిసినట్లే. ఇప్పుడు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి కెప్టెన్ అయ్యే అవకాశం పూజారే, రహానాకి లేనట్టే. ప్రస్తుతం జట్టులో ఉన్న సీనియర్లు జడేజా, అశ్విన్ కు కెప్టెన్ ఇచ్చే పరిస్థితి లేదు. దీర్ఘకాలం పాటు సేవలు అందించే వారే జట్టుకు కెప్టెన్ గా బెటర్ ఆప్షన్ అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. దీంతో జడేజా, అశ్విన్ రేసులో లేనట్టే. అయినా విదేశాల్లో టెస్టులు ఆడినప్పుడు జడేజా, అశ్విన్ లో ఒక్కరే తుది జట్టులో ఉంటున్నారు. జోడిగా ఆడుతున్న సందర్భాలే కనిపించడం లేదు. అలాంటప్పుడు వీరికి టెస్ట్ కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సే లేదనే చర్చ జరుగుతుంది. గతంలో ఏడ్జ్ భాస్టన్ టెస్ట్ లో బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు.

Team India 2024 Schedules

కెప్టెన్సీ రేస్ లో బుమ్రా కూడా ఉన్నట్లే. కాకపోతే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా సీనియర్ బౌలర్ అన్ని టెస్టుల్లో ఆడే అవకాశం ఉండకపోవచ్చు. పేసర్లు ఎక్కువగా మ్యాచ్ ఆడడం కూడా అంత ఈజీ కాదు. కేఎల్ రాహుల్ 3 టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ ఎప్పుడు జట్టులో ఉంటాడో…. ఎప్పుడు గాయాల బారిన పడతాడో తెలియని పరిస్థితి. ఇటీవల నిలకడగానే రాణిస్తున్నాడు. గతంలో పెద్దగా ట్రాక్ రికార్డు ఏమీ లేదు. దీంతో రాహుల్ కూడా రేసులో ఉండకపోవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ వారసుడిగా గిల్ పేరు వినిపిస్తుంది. కానీ వైట్ బాల్ క్రికెట్ లో జోరు చూపించినంతగా టెస్టుల్లో గిల్ ఆడలేకపోతున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో గిల్ కు చోటు దండగ అనేవారు కూడా ఉన్నారు.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading