టీమిండియాకు అదేవిధంగా క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఐసీసీ ఈవెంట్లతో పాటు పలు ముఖ్యమైన మ్యాచ్ ల్లో బోల్తా కొడుతున్న భారత టీమ్ కి ఊపిరినిచ్చే వార్త ఇది. గాయం కారణంగా గత కొద్ది రోజుల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరమైన స్పీడ్ గన్ బుమ్రా.. రీ ఎంట్రీకి రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ స్పీడ్ స్టార్ న్యూజిలాండ్ లో సర్జరీ చేయించుకున్నాడు.
Advertisement
ఇక ఈ ఏడాది అక్టోబర్ లో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా పేస్ బౌలింగ్ అటాక్ అభిమానులకు కలవరపెడుతోంది.తాజాగా అందిన వార్తతో అభిమానుల్లో జోష్ పెరిగింది. ఆగస్టులో మూడు టీ 20 సిరస్ లో భాగంగా టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 18, 20, 23 తేదీల్లో మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ సిరీస్ ద్వారా బుమ్రా పునరాగమనం చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం బుమ్రా బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో వీవీఎస్ లక్ష్మణ్, నితిన్ పటేల్ పర్యవేక్షణలో ఉన్నాడట.
Advertisement
గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెన్ను నొప్పి కారణంగా దూరమయ్యాడు బుమ్రా. గత ఏడాది ఆసియా కప్ నుంచి దూరమయ్యాడు. గాయం తిరగబడటంతో టీ20 వరల్డ్ కప్, శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ లతో పాటు బోర్డర్ గావస్కర్ ట్రోపీ,డబ్ల్యూటీసీ ఫైన్ వంటి కీలక మ్యాచ్ లను ఆడలేదు బుమ్రా. దీంతో భారత జట్టు బౌలింగ్ బలహీనంగా ఉందనే చెప్పాలి. ఇక ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ లో బుమ్రా కీలకం కానున్నాడు. ఈలోపు అతను పూర్తి ఫిట్ నెస్ సాధించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
కోహ్లీ ఆదాయం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
విరాట్ కోహ్లీతో గొడవపై నవీన్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు పై కోపంతోనే రాయుడు వైసీపీలో చేరాడా ? కారణం ఏంటంటే ?