Home » బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్

by Anji
Ad

లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లి**క్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆమెకు ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి ఈడీ విమానంలో తరలిస్తోంది. రేపు రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట కవితను ఈడీ హాజరుపరచనుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి బయలుదేరారు. కవిత అరెస్ట్ పై ఢిల్లీలోని న్యాయవాదులతో చర్చించనున్నారు. కవిత అరెస్ట్ కు కౌంటర్ గా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

Advertisement

Advertisement

ఢిల్లీ లి**క్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేయడం ఈడీ కి పెద్ద టాస్క్ లాగా మారిందనే చెప్పాలి. కవిత ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు బంజారాహిల్స్ లోని ఆమె నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమె ను అరెస్ట్ చేస్తారని తెలిసి.. ఆందోళన చేపట్టారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తున్న అధికారులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఈడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. కవిత వెళ్తున్న కారుకు అడ్డం పడ్డారు. దీంతో వారిని కారుకు అడ్డు తొలిగించేందుకు చేసేది ఏమి లేక పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులు చేసిన లాఠీ ఛార్జ్ లో కొందరు బీఆర్ఎస్ శ్రేణులకు గాయాలు అయ్యాయి. లాఠీ ఛార్జ్ నడుమ కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు అధికారులు.  ఇవాళ రాత్రి 11.30 ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నైట్ ఈడీ కార్యాలయంలోనే ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత.

Also Read :   అమితాబ్ అభిమానులకు శుభవార్త.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..!

 

Visitors Are Also Reading