Home » బాలయ్య సినిమాకు బ్రేక్.. ఎందుకంటే..?

బాలయ్య సినిమాకు బ్రేక్.. ఎందుకంటే..?

by Azhar
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది చివర్లో అఖండ సినిమాతో సూపర్ హిట్ అనేది అందుకున్న బాలయ్య.. ఈ ఏడాది ఏ సినిమా కూడా విడుదల చేయడం లేదు, ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Advertisement

అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అనేది షా వేగంగా షూటింగ్ అనేది జరుపుకుంటూ వచ్చింది. ఇక ఈ సినిమాలో కేవలం చివరి షెడ్యూల్ మాత్రమే ఉంది. కానీ ఇటువంటి సమయంలో ఈ వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ కు వరుస బ్రేకులు అనేవి పడుతున్నాయి అని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మంచి జోరు మీద ఉన్న సమయంలో బాలయ్య ఆహ అన్ స్టాపబుల్ సీజన్ 2 ల పాల్గొంటున్నాడు.

Advertisement

ఈ షో ప్రోమో నుండి ఎపిసోడ్స్ షూటింగ్స్ వల్ల ఇప్పటికే దాదాపు వారం రోజులు వాయిదా పడిన వీరసింహారెడ్డి సినిమా ఇప్పుడు.. బాలయ్య చేస్తున్న యాడ్స్ వల్ల ఆలస్యం అవుతుంది అని తెలుస్తుంది. అయితే తాజాగా బాలయ్య మొదటిసారి ఓ కమర్షియల్ యాడ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని కోసం మరో మూడు రోజులు వీరసింహారెడ్డి షూటింగ్ అనేది అహిపోయింది అని తెలుస్తుంది. అయితే ఇలా వరుస బ్రేకులు అనేవి వేస్తే.. ఈ సినిమా అనుకున్న విధంగా రిలీజ్ అవ్వడం కష్టం అవుతుంది.

ఇవి కూడా చదవండి :

తమ మెన్స్ జట్టు పరువు తీసేసిన పాక్ మహిళా ప్లేయర్..!

ఇండియా, పాక్ మ్యాచ్ లైవ్ లో చూడాలని ఉంది..!

Visitors Are Also Reading