Brahmanandam: హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ బ్రహ్మానందం నవ్వించారు. బ్రహ్మానందం గురించి మనందరికీ తెలుసు కానీ బ్రహ్మానందం గారి భార్య లక్ష్మీ గారి గురించి ఎవరికీ తెలియదు. ఆమె గురించి అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా బ్రహ్మానందం నటన గురించి చెప్పుకోవాల్సిందే. మొన్న ఆ మధ్య వచ్చిన రంగమార్తాండ సినిమాలో అద్భుతంగా నటించారు. గొప్ప గొప్ప సినిమాలతో రంగమార్తాంట సినిమాని పోల్చారు. అన్ని సినిమాలతో అందరినీ నవ్వించిన బ్రహ్మానందం ఈరంగమార్తాంట సినిమాతో అందరిని ఏడిపించేసారు.
Advertisement
బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఇద్దరు కొడుకులు వీళ్ళకి. బ్రహ్మానందం లక్ష్మి వేరువేరు కులాలకి చెందిన వాళ్ళు. బ్రహ్మానందం గారి భార్య లక్ష్మి చాలా సున్నితమైన మనసు కలవారు. బ్రహ్మానందం లెక్చరర్ గా పని చేసేవారు. ఒకపక్క లెక్చరర్ గా పని చేస్తూ ఇంకోపక్క సినిమాలో నటించేవారు. లక్ష్మి గారు గృహిణి. బ్రహ్మానందం ఎప్పుడూ కూడా కామెడీతో నవ్విస్తూ ఉండేవారు అందుకనే ఆయన సినిమాల్లోకి వస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు అలా అంతా అన్నట్లుగానే బ్రహ్మానందం సినిమాల్లోకి వచ్చారు నటనతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు. చక్కటి పాత్రలు పోషించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. హాస్యంతో నటనతో ఎన్నో అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు. బ్రహ్మానందం ఇప్పటిదాకా వెయ్యి చిత్రాలలో కనిపించి సజీవ నటుడు కోసం అత్యధిక స్క్రీన్ క్రెడిట్ లు సాధించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కలిగి ఉన్నారు.
Advertisement
Also read:
- ఉదయ్ కిరణ్తో చిరంజీవి తన కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?
- HanuMan Total Collections: హనుమాన్ సినిమాకి ఎన్ని వందల కోట్లు లాభమో తెలుసా..?
- బాలకృష్ణ, హరికృష్ణలు కలిసి నటించిన 3 సినిమాలు!
బ్రహ్మానందం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశారు. బ్రహ్మానందం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తారు. థియేటర్లో మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. 1985లో డిడి తెలుగు యొక్క పకపకాలతో టెలివిజన్లో అరంగ్రేటం చేశారు. ప్రేక్షకుల నుండి ప్రశంసలని పొందారు దర్శకుడు జంధ్యాల అతనికి ఆహనా పెళ్ళంట సినిమా చేయడానికి అవకాశం ఇచ్చారు. దీంతో బ్రహ్మానందం కెరీర్ టర్న్ అయిపోయింది. 35 సంవత్సరాలకు పైగా ఉన్న కెరియర్ లో ఆరు రాష్ట్ర నంది అవార్డులు, ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డుని అందుకున్నారు. అలానే ఆరు సినిమా అవార్డులను కూడా అందుకున్నారు బ్రహ్మానందం.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!