ప్రస్తుతం స్టార్స్ సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్ సైతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు అంటే వాటికి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వెబ్ సిరీస్ లలో నటించేందుకు భారీ రెమ్యునరేషన్ లు కూడా అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రానా మరియు వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు.
Advertisement
నెట్ ఫ్లిక్స్ లో సిరీస్ రిలీజ్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ మరియు రానాలు తండ్రి కొడుకులు గా నటించారు. ఇక ఈ వెబ్ సిరీస్ 10 వ తేదీన విడుదల చేశారు. అంతే కాకుండా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ ను సైతం ఓ రేంజ్ లో నిర్వహిస్తున్నారు.
Advertisement
ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం బ్రహ్మానందం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బ్రహ్మానందం తనను తాను ఆస్కార్ నాయుడు అని పరిచయం చేసుకుని సిరీస్ లో నాగనాయుడు పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన వెంకటేష్ కు చిర్రెత్తిపోవడంతో రానాకు తండ్రిగా నేనే నటిస్తానని స్టేట్ మెంట్ ఇచ్చాడు.
దాంతో బ్రహ్మా ఆ క్యారెక్టర్ కి నాకు ఏజ్ సరిపోలేదని వెంకటేష్ ను పెట్టారు. ఓకే ఏం పొడిచారో ఎంత పొడిచారో నేను చూస్తాను మీరు చూడండి..వాచ్ రానా నాయుడు స్ట్రీమింగ్ ఆన్ నెట్ ఫ్లిక్స్ అంటూ ముగించారు. ఇక ప్రస్తుతం ఈవీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా నెటిజన్ లు బ్రహ్మా బ్యాక్ అంటూ సంబరపడిపోతున్నారు.
Advertisement
ALSO READ :ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ దర్శకుడు ఎలా చనిపోయాడో తెలుసా ?