Home » రామ్ అభిమానులకు శుభవార్త.. బోయపాటి RAPO20 కీలక అప్డేట్ వచ్చేసింది..!

రామ్ అభిమానులకు శుభవార్త.. బోయపాటి RAPO20 కీలక అప్డేట్ వచ్చేసింది..!

by Anji
Ad

బోయపాటి శ్రీను ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ క్రేజీ కాంబోలో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. RAPO20 గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన లుక్స్ ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్టేట్ అందించాడు బోయపాటి శ్రీను. ఇప్పటికే RAPO20 డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ సినిమాని అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలియజేశారు మూవీ మేకర్స్. 

Also Read :  Keerthy Suresh : కీర్తి సురేష్ కు ఏమైంది…? ముఖంపై గాయాలతో మహానటి…!

Advertisement

 

 

మేకర్స్ బోయపాటి డబ్బింగ్ స్టూడియోలో ఉన్న స్టిల్ ను ట్వీట్ చేస్తూ డబ్బింగ్ నేడు షురూ అయింది. ఊరమాస్ అవతార్ లో ఉన్న ఉస్తాద్ రామ్ ను కలిసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు బోయపాటి. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న రామ్ ఓ గుడి ముందు భారీ దున్నపోతు ముక్కుతాడు పట్టుకొని వస్తున్న స్టిల్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

Advertisement

Manam News

ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసచిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ది వారియర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సారి బోయపాటి శ్రీనుతో చేస్తున్న మూవీతో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు రామ్. 

  Also Read   : ఆ ఒక్క కారణంతోనే అనసూయ విజయ్ ని ట్రోల్ చేస్తుందా…?

Visitors Are Also Reading