బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను కలిసిన వెంకటేశ్.. సీఎం రేవంత్‌తో పాటు కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వెంకటేశ్ 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళ్లారని స్పష్టంగా అర్థం అవుతోంది. ఎందుకంటే వేణుగోపాల్ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పారు.
Advertisement
Advertisement
వెంకటేష్ నేత బోర్లకుంట తెలంగాణపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 17వ లోక్‌సభకు పార్లమెంట్ సభ్యుడు . ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివారు. ఎన్నికలకు ముందు ఆయన తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఆయన CPS వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న CPSTEATS నాయకుడు కూడా కావడం విశేషం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి బాల్క సుమన్ ఓడిపోవడంతో ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బాల్కసుమన్ కి టికెట్ ఇస్తారని వార్తలు వినిపించాయి. దీంతో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!