Home » సుకుమార్ పెద్ద ప్లానే వేశాడుగా…! పుష్ప-2 లో ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే..?

సుకుమార్ పెద్ద ప్లానే వేశాడుగా…! పుష్ప-2 లో ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే..?

by Mounika
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ పుష్ప ది రైజర్ కంటే రెండో పార్ట్ పుష్ప ది రూరల్ తో ప్రేక్షకుల్లో మరింత భారీ అంచనాలు కలిగే విధంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అయితే పుష్ప ది రూరల్ ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదలై ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ప్రతి అంశాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు సుకుమార్.

Pushpa

Advertisement

ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక సుకుమార్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రానికి అయ్యే బడ్జెట్ లో ఏ మాత్రం వెనకాడటం లేదట. ఇప్పటికే ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలా తో మూడు నిమిషాల నిడమి ఉన్న ఒక ఐటమ్ సాంగ్ కి ఏకంగా మూడు కోట్లు ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. పుష్ప 2 పై అభిమానుల్లో భారీ అంచనాల పెంచడానికి ఈసారి సుకుమార్ పెద్ద ప్లానే వేశాడట సుకుమార్.

Advertisement

Pushpa 2

ఈ చిత్రంలో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోతో సంప్రదింపులు జరిపినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఆ స్టార్ హీరో అతిధి పాత్రలో కనిపిస్తున్నాడని.. ఆయన పాత్ర ఈ సినిమా కథ మలుపు తిప్పే విధంగా సుకుమార్ చూపించబోతున్నాడని సమాచారం వినిపిస్తుంది. అందుకోసమే సుకుమార్ ఆ బాలీవుడ్ స్టార్ హీరోని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం స్టార్ హీరో కిలాడి అక్షయ్ కుమార్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. వస్తున్న వార్తల ప్రకారం ఇదే నిజమైతే ఈ సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ చిత్రాలు ఇవే..

మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ‘రాఘవేంద్ర’ మూవీలో సెకండ్ హీరోయిన్ గుర్తుందా ?

మెగా ఫ్యామిలీ పై సంచలన కామెంట్స్ చేసిన చైతన్య తండ్రి ప్రభాకర్..! ఏమన్నారంటే..!

 

 

 

Visitors Are Also Reading