Home » మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ‘రాఘవేంద్ర’ మూవీలో సెకండ్ హీరోయిన్ గుర్తుందా ?

మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ‘రాఘవేంద్ర’ మూవీలో సెకండ్ హీరోయిన్ గుర్తుందా ?

by Bunty
Ad

శ్వేత అగర్వాల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా గుర్తింపు రాలేదు. ‘అల్లరి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. అప్పు క్యారెక్టర్ లో నటించి ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Advertisement

ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన శ్వేత అగర్వాల్ గమ్యం సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇక చివరగా శ్వేత షాపిత్ అనే హారర్ సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ శ్వేతాకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాలకు పూర్తిగా దూరమై 2020లో సింగర్ ఆదిత్య నారాయణ్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక కూతురు జన్మించింది.

Advertisement

 

ఇక సినిమాలకు పూర్తిగా దూరమైనటువంటి శ్వేతా తన కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుంది. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. తన కూతురితో గడిపిన మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది ఈ అమ్మడు. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన భర్త, బిడ్డతో కలిసి ఆనందంగా గడుపుతుంది.

Visitors Are Also Reading