Home » ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ చిత్రాలు ఇవే..

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ చిత్రాలు ఇవే..

by Mounika
Ad

ఒక సినిమా తెరపైకి రావాలి అంటే దాని వెనక ఎంతో మంది వ్యక్తుల కృషి ఉంటుంది. లైట్స్ మెన్ దగ్గర నుంచి మూవీ మేకర్స్ వరకు ఒక సినిమా థియేటర్లో రిలీజ్ కావడానికి ఎంతో కష్టపడతారు. ఒక సినిమాని తీయడం ఎంత కష్టమో.. ఇంకా దానిని రిలీజ్ చేయడానికి కూడా అంతే కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడైతే తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు.

Advertisement

సినిమా కథాంశం బాగున్న కూడా రిలీజ్ కావడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇలా ఎన్నో మంచి చిత్రాలు రిలీజ్ కి నోచుకోకుండానే ల్యాబ్స్ కు పరిమితమైపోయాయి. కంటెంట్ బాగున్నా ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని ఆ చిత్రాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

#1. శాంతినివాసం :

చిరంజీవి, మాధవి జంటగా నటించిన చిత్రం శాంతినివాసం. ఈ సినిమాకి బాబు అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుందట . కానీ ఈ సినిమా నిర్మాత సడన్ గా మరణంతో ఈ సినిమా రిలీజ్ నోచుకోలేదట.

#2. జాదు :

7/జి బృందావన కాలనీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రవి కృష్ణ. తమిళంలో కేడి పేరుతో రిలీజ్ అయిన ఈ చిత్రంలో రవి కృష్ణకు జంటగా ఇలియానా, తమన్నా హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రం జాదు పేరుతో 2007 లో తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాని రిలీజ్ చేయలేకపోయారట మేకర్స్.

#3 దట్ ఇస్ మహాలక్ష్మి :

హిందీలో కంగనా రౌనత్ నటించి సూపర్ హిట్ అయినా క్వీన్ చిత్రానికి రీమేక్ కే దట్ ఇస్ మహాలక్ష్మి మూవీ. ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. 2019లో దిస్ కావలసిన ఈ చిత్రంలో ఇప్పుడు కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు

#4. డికే బోస్ :

సందీప్ కిషన్, నిషా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన డికే బోస్ కూడా 2013-14 టైంలో రిలీజ్ కావాల్సింది. కానీ ఈ చిత్రం ఇప్పటికి రిలీజ్ కాలేదు.

Advertisement

#5.భీమ :

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన భీమ తెలుగు వెర్షన్ రిలీజ్ కాలేదు.

#6 కోతి కొమ్మచ్చి :

శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా రూపొందిన కోతి కొమ్మచ్చి 2020 లో రిలీజ్ కావలసి ఉంది . కానీ ఇప్పటికీ ఈ చిత్రం రిలీజ్ కి నోచుకోలేదు.

#7 ఐనా ఇష్టం నువ్వు :

వి.కే నరేష్ తనయుడు నవీన్ మరియు కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ఐనా ఇష్టం నువ్వు .  2016 లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ కూడా రిలీజ్ అవ్వలేదు.

#8 ధృవ నక్షత్రం :

విక్రమ్, ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ధృవ నక్షత్రం 2016 లో రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పటికి కూడా రిలీజ్ కాలేదు.

#9. ఇంటింటా అన్నమయ్య :

రేవంత్ (తొలిపరిచయం), అనన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఇంటింటా అన్నమయ్య చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 2013లో రిలీజ్ కా వలసిన ఈ చిత్రం ఇప్పటికి కూడా రిలీజ్ అవ్వలేదు.

#10 నా పేరు శివ 2 :

తమిళ్ లో కార్తి హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 2014 వచ్చిన మద్రాసి చిత్రాన్ని తెలుగులో నా పేరు శివ 2 పేరుతో రిలీజ్ చేస్తున్నట్టు 2022 ఆరంభంలో మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికీ ఈ చిత్రం కూడా రిలీజ్ కాలేదు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఆ స్టార్ హీరోను రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్‌..?

Balakrishna: బాలయ్య కేక్ తినిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరు? నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటో!

బాహుబలి ఇంటర్వెల్ రాజమౌళి మొదటగా అనుకున్నట్లు తీసుంటే.. సినిమా మరోలా ఉండేదేమో..

 

Visitors Are Also Reading