Home » పాలిటిక్స్‌ లోకి బిత్తిరి సత్తి.. కేసీఆర్‌ కు వ్యతిరేకంగా బరిలోకి ?

పాలిటిక్స్‌ లోకి బిత్తిరి సత్తి.. కేసీఆర్‌ కు వ్యతిరేకంగా బరిలోకి ?

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ మూడో తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువబడుతాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే… టికెట్లను కూడా ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Bithiri Sathi Political Entry

Bithiri Sathi Political Entry

ఇదంతా పక్కకు పెడితే.. ప్రముఖ కమెడియన్, ఆర్టిస్ట్, న్యూస్ రీడర్ బిత్తిరి సత్తి గురించి తెలియని వారుండరు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నుంచి ప్రముఖ కమెడియన్, ఆర్టిస్ట్, న్యూస్ రీడర్ బిత్తిరి సత్తి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. అందులోనూ బిత్తిరి సత్తి సామాజిక వర్గమైన ముదిరకు చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారని అక్కడి అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అందుకే బిత్తిరి సత్తి ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

ఇటీవల హైదరాబాదులో జరిగిన ముదిరాజ్ మహాసభలో బిత్తిరి సత్తి అధికారపార్టీ ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం పట్ల ఘాటు వాక్యాలు చేయడం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ తరుణంలోనే.. ప్రముఖ కమెడియన్, ఆర్టిస్ట్, న్యూస్ రీడర్ బిత్తిరి సత్తి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading