Home » బిగ్ బాస్ సీజన్ 7: మూడో వారం ఇంటి నుండి.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 7: మూడో వారం ఇంటి నుండి.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

by Sravya
Ad

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు ప్రసారమవుతున్న విషయం తెలిసింది. ఇప్పటివరకు 6 సీజన్స్ పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు ఉల్టా పుల్టా అని రంగంలోకి దిగారు ఈ ఏడవ సీజన్లో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. సెప్టెంబర్ మూడున బిగ్బాస్ షో ప్రారంభమైన విషయం తెలిసిందే తొలి వారంలో చూసుకున్నట్లయితే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. రెండవ వారం షకీలా ఇంటి నుండి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు మూడవ వారం ఎలిమినేషన్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మూడవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Advertisement

మొత్తం ఏడుగురు ఈసారి నామినేషన్స్ లో ఉన్నారు. దామిని, శుభశ్రీ, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, అమర్దీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్. వీళ్ళల్లో ఒకరు ఇంటి నుండి వారం వెళ్ళిపోతున్నారు సోమవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అమర్దీప్ చౌదరి టాప్ లో ఉన్నారు. తర్వాత ప్రిన్స్ యావర్, ఆ తర్వాత ప్రియాంక, గౌతమ్ కృష్ణ, రతిక ఉన్నారు. శుభశ్రీ ఆరవ స్థానంలో, దామిని అందరికంటే తక్కువ ఓట్లతో ఉన్నారు. కనుక దామినీ ఈసారి ఇంటి నుండి వెళ్లిపోయే అవకాశం కనబడుతోంది. శుభశ్రీకి కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్లిపోవచ్చు అని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

Also read:

Visitors Are Also Reading