బిగ్ బాస్ సీజన్ 6 ని బిగ్ బాస్ యాజమాన్యం చాలా గ్రాండ్ గా లాంచ్ చేసింది. కానీ కంటెస్టెంట్ లో ఎంపిక విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం తప్పు చేసి బిగ్ బాస్ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఎందుకంటే చాలామంది హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్ లు చాలామంది ప్రేక్షకులకు తెలియదు. దీంతో షో రేటింగ్ కాస్త తగ్గిపోయింది. కానీ అనుకోని విధంగా బిగ్ బాస్ బాగా ఆడే ప్లేయర్స్ ని ఎలిమినేట్ చేయడం వల్ల ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అంటూ చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఈ నేపద్యంలోనే బిగ్ బాస్ విన్నర్ రేవంత్ అయ్యారు.
Advertisement
also read;దానికోసం ఆరాటపడే వ్యక్తిత్వం కాదు నాది..మరోసారి సమంత సంలచన వ్యాఖ్యలు..!
అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే శ్రీహన్ విన్నర్ కానీ సూట్ కేస్ ఆఫర్ కి ఆశపడి విన్నర్ అయ్యే ఛాన్స్ ని పోగొట్టుకున్నాడు శ్రీహాన్.అయితే రేవంత్ హౌస్ లోకి వెళ్ళిన మొదటి నుండే నేనే విన్నర్ అవుతాను అంటూ చాలా సార్లు చెప్పారు. కానీ రేవంత్ ఇలా చెప్పడం చాలా మందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. అయినప్పటికీ ఈయన ఆట తీరు బాగానే ఉన్నా ఎదుటి వారిపై కోపగించుకోవడం చాలామందికి నచ్చలేదు. దీంతో ఈయన బిహేవియర్ చూసిన చాలామంది జనాలు త్వరలోనే హౌస్ వదిలి వెళ్ళక తప్పదు అంటూ అప్పట్లో కామెంట్స్ చేశారు. కానీ అనూహ్యంగా రేవంత్ విన్ అయ్యారు. ఇక రేవంత్ ఆట తీరు పై చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకుల్లో అలాగే ఇంటి సభ్యులలో కూడా చాలా నెగిటివిటీ ఉంది.
Advertisement
అలాంటి నెగెటివిటీ ఉన్న కంటెస్టెంట్ విన్నర్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ 6 టైటిల్ విన్నర్ రేవంత్ అవ్వడానికి ముఖ్య కారణం హౌస్ లో ఆయనకు పోటీ ఇచ్చే కంటెస్టెంట్లు చాలా తక్కువ మంది. అందులోనూ ప్రతి విషయంలో రేవంత్ టాప్ పొజిషన్ లో ఉన్నారు. అంతేకాదు శ్రీహన్ ఈయనకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మొదట్లో ఆయన సరిగా ఆడలేదు. అలాగే కీర్తి భట్ ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతూ టైటిల్ విన్ అయ్యే అవకాశాన్ని పోగొట్టుకుంది. ఇక ఆది రెడ్డి రివ్యూలు చెప్పుకోవడం తోనే సరిపెట్టుకున్నారు. ఇక రోహిత్ కేవలం మంచోడిగానే పేరు తెచ్చుకున్నారు. కానీ టాస్క్ లలో పర్ఫామెన్స్ చూపించలేకపోయారు.ఇక వీరి నెగిటివ్ పాయింట్స్ అన్ని రేవంత్ కి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. దీంతో టైటిల్ విన్ అయ్యారు.
Also read;విన్నర్ రేవంత్ కంటే ఎక్కువ గెలుచుకున్న శ్రీహాన్..ఎన్ని లక్షలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?