Home » విన్న‌ర్ రేవంత్ కంటే ఎక్కువ గెలుచుకున్న శ్రీహాన్..ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..?

విన్న‌ర్ రేవంత్ కంటే ఎక్కువ గెలుచుకున్న శ్రీహాన్..ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..?

by AJAY
Ad

బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 18న ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ సీజన్ లో విన్నర్ గా ముందు నుండి అనుకున్నట్టుగానే సింగర్ రేవంత్ గెలిచాడు. అయితే సింగర్ రేవంత్ గెలిచింది మాత్రం ఓట్లతో కాదు…. రేవంత్ టాప్ 2 స్థానంలో ఉండగా శ్రీహాన్ ఓట్ల పరంగా మొద‌టి స్థానంలో నిలిచాడు. కానీ శ్రీహాన్ విన్నర్ అవుతాన‌ని అనుకోలేదు….ఆ అనుమానంతో నాగార్జున ఇచ్చిన 40 లక్షల బ్రీఫ్ కేస్ ను తీసుకోవడం వల్ల రెండవ స్థానంలో నిలిచాడు.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే విన్నర్ రేవంత్ కు రావాల్సిన దానికంటే రన్న‌ర‌ప్ గా నిలిచిన శ్రీహాన్ కే ఎక్కువ డబ్బులు వచ్చాయి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం… శ్రీహాన్ నాగార్జున ఆఫర్ చేసిన మొత్తం 40 లక్షల డబ్బులను తీసుకున్నాడు. అయితే మొదట శ్రీహాన్ బ్రీఫ్ కేస్ తీసుకోకూడదని అనుకున్నప్పటికీ శ్రీహాన్ తండ్రి తీసుకోవాలని సలహా ఇచ్చాడు.

అంతేకాకుండా చాలా మంది కంటెస్టెంట్ లు డబ్బులు తీసుకోమని అన్నారు. దాంతో శ్రీహాన్ 40 లక్షల రూపాయలను తీసుకున్నాడు. ఇక విన్న‌ర్ గా నిలిచిన రేవంత్ కు కేవలం 10 లక్షలు మాత్రమే దక్కింది. అంతేకాకుండా మరో 25 లక్షల రూపాయలను సువర్ణభూమి వాళ్లు అందించారు. అలా చూసుకుంటే డబ్బులపరంగా శ్రీహాన్ కే ఎక్కువ వచ్చాయి. కానీ రేవంత్ కు బ్రేజా కారు కూడా వచ్చింది.

Visitors Are Also Reading