Home » బిగ్ బాస్ లోకి రావడానికి లంచం…అస‌లు నిజాలు బయటపెట్టిన జెస్సీ…!

బిగ్ బాస్ లోకి రావడానికి లంచం…అస‌లు నిజాలు బయటపెట్టిన జెస్సీ…!

by AJAY
Ad

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంతమంది కంటెస్టెంట్ లు తామే డబ్బులు ఇచ్చి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారని వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రతి సీజన్ లోనూ ఒక‌రిద్ద‌రిపై అలాంటి వార్తలు కామన్. గతంలో వారిని సినిమాల్లో చూడకపోవడం ఎలాంటి పాపులారిటీ లేకపోవడం వల్లనే ఇలాంటి వార్తలు వస్తాయి. అసలు పాపులారిటీ లేని వారికి బిగ్ బాస్ లో ఎలా ఆఫర్ వచ్చింది..? అన్న అనుమానాల నేపథ్యంలో లంచం ఇచ్చి ఇచ్చారంటూ వార్తలు వస్తాయి. అయితే బిగ్ బాస్ సీజన్ -5 లో కూడా అలాంటి కామెంట్స్ ఓ కంటెస్టెంట్ పై వస్తున్నాయి. అత‌డే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తాను మోడల్ గా పరిచయం చేసుకున్నా జెస్సీ. జెస్సీ కొన్ని వారాల పాటు ప్రేక్షకులను అలరించారు. హౌస్ లో ష‌ణ్ముక్ మ‌రియు సిరిల‌తో ఫ్రెండ్ షిప్ చేస్తూ మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు.

bigg boss jessy

bigg boss jessy

కానీ బ్యాడ్ ల‌క్ తో అనారోగ్యం కారణంగా ఇంటి బాట పట్టాడు. అయితే జెస్సీ చాలా రిచ్ అని బిగ్ బాస్ కు డ‌బ్బులు ఇచ్చి వ‌చ్చాడ‌ని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆ వార్తలపై స్పందించారు. తాను ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. అకౌంట్ లో ప్ర‌స్తుతం 11,000 వేలు మాత్రమే ఉన్నాయని అన్నాడు. తను బిగ్ బాస్ లోకి రావ‌డానికి డబ్బులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించాడు.

Advertisement

Advertisement

also read : చిచ్చా చార్లెస్ కు పేరెంట్స్ స‌పోర్ట్ లేదు..వాడు చాలా క‌ష్ట‌ప‌డ్డాడు ట్రోల్ చేయోద్దు…స‌ద్దామ్ రిక్వెస్ట్…!

తెలియని వాళ్ళు ఏదో అనుకుంటారంటే ఏమే కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావాళ్లు కూడా అదే మాట అంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా మాట్లాడటం త‌న‌ను బాధించిందని…. త‌న‌కు తండ్రి లేడు అంటూ జెస్సీ ఎమోష‌న‌ల్ అయ్యారు. రాత్రి ఉద్యోగం చేసి ఆ డబ్బులతో మోడలింగ్ నేర్చుకుంటూ ఇక్క‌డి వ‌ర‌కూ వ‌చ్చాన‌ని జెస్సీ చెప్పాడు. బిగ్ బాస్ ఫ్రీ గా వచ్చింద‌ని తాను వెళ్లాన‌ని..తన‌కు డ‌బ్బులు ఇవ్వ‌కున్నా చేద్దామ‌ని డిసైడ్ అయిన‌ట్టు చెప్పాడు. కానీ కానీ త‌న‌కు డబ్బులు ఇచ్చారని చెప్పాడు. అంతేకాని ఎదురు డబ్బులు ఇచ్చే స్తోమత మాకు లేదు అంటూ జెస్సీ క్లారిటీ ఇచ్చాడు.

Visitors Are Also Reading