సోషల్ మీడియాలో తెలుగు పాటలు పాడుతూ చిచ్చా చార్లెస్ టీవీ షోలు చేసే స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ తో పాటూ ఇతర టీవీషోలు చేస్తూ ప్రస్తుతం చార్లెస్ బిజీగా ఉన్నాడు. అయితే ఇలాంటి సమయంలో అతడు తన పాస్ పోర్ట్ రెన్యువల్ చేసుకోలేదంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ ఆఫ్రికా నుండి వచ్చి తమ వీసా గడవు ముగిసిగా ఇండియాలోనే ఉండటంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. వారిలో చిచ్చా కూడా ఉన్నాడు. అయితే అతడు అరెస్ట్ అయిన తరవాత పుకార్లు రావడం ప్రారంభం అయ్యాయి. పలువురు డ్రగ్స్ అమ్ముతూ కూడా పట్టుబడటంతో చిచ్చా పై కూడా ట్రోల్స్ వస్తున్నాయి.
saddam on chiccha charles
దాంతో ఈ అంశంపై తాజాగా పటాస్ కమిడియన్ సద్దామ్ స్పందించారు. జైలులో ఉన్న చిచ్చాతో సద్దామ్ వీడియో కాల్ మాట్లాడారు. సద్దామ్ మాట్లాడుతూ….చిచ్చా ఎంతో కష్టపడి పైకి వచ్చాడని చెప్పారు. అతడు ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు చేయలేదని…అతడి వద్ద డబ్బులు లేకపోవడంతోనే పాస్ పోర్ట్ రెన్యువల్ చేసుకోలేదని చెప్పాడు. దయచేసి అతడిని ట్రోల్ చేయవద్దని సద్దామ్ కోరారు. వాళ్ల పేరెంట్స్ నుండి చిచ్చాకు ఎలాంటి సపోర్ట్ లేదని అతడు పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ ఇక్కడి వరకూ వచ్చాడని చెప్పారు.
Advertisement
Advertisement
also read : BIGG BOSS -5 : హాస్పిటల్ కు వీజే సన్నీ…అసలేం జరిగింది..?
తాము చేసే ఈవెంట్ల ద్వారానే చిచ్చాకు ఫేమ్ వస్తుందని అన్నారు. చిచ్చా తెలిసిన ముఖం కావడంతో అతడినే ఫోకస్ చేస్తున్నారని అన్నారు. ఆ తరవాత సద్దామ్ తో వీడియో కాల్ మాట్లాడుతూ జోకులు వేశాడు. ప్రస్తుతం చిచ్చా నాంపల్లి జైలులో ఉన్నానని చెప్పగా ఫుడ్ కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవాలని నేను ఆర్డర్ చేస్తానని సద్దామ్ హామీ ఇచ్చారు. ఇక తనపై ఎలాంటి కేసులు లేవని…తన వీసా రెన్యువల్ చేసుకోకపోవడం వల్లనే పోలీస్ స్టేషన్ లో ఉన్నానని చెప్పాడు. ఫోన్ చేసిన సద్దామ్ టీమ్ కు కృతజ్ఞతలు చెప్పాడు.