Home » Bigboss telugu6:పైమా పంట పండిందా.. మల్లెమాల కంటే బిగ్ బాస్ ఇన్ని రెట్లు ఎక్కువ ఇస్తోందా..?

Bigboss telugu6:పైమా పంట పండిందా.. మల్లెమాల కంటే బిగ్ బాస్ ఇన్ని రెట్లు ఎక్కువ ఇస్తోందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

పటాస్ షో నుండి తన ప్రస్థానం స్టార్ట్ చేసి జబర్దస్త్ షో ద్వారా మరింత గుర్తింపు సాధించుకుంది పైమా.. పటాస్ కార్యక్రమంలో తనదైన పర్ఫార్మెన్స్ తో మల్లెమాల దృష్టిని ఆకర్షించి జబర్దస్త్ అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ లో ఒక స్టార్ కమెడియన్ గా మారింది. స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ సమయంలో జబర్దస్త్ ను వదిలేసి స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నది. దీనికి ప్రధాన కారణం స్టార్ మా బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెకు అత్యధిక పారితోషికాన్ని ఆఫర్ చేయడం వల్లే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె జబర్దస్త్ లో నటించినప్పుడు వారానికి లక్ష రూపాయల వరకు పారితోషికంగా వచ్చేది.

Advertisement

also read:బాధ, కోపాన్ని ఉద‌య్ కిర‌ణ్ ఎందుకు త‌న‌లోనే దాచుకున్నాడు…? సంచ‌ల‌న నిజాలు బయ‌ట‌పెట్టిన న‌టుడు..!

Advertisement

కానీ నెలలో 10 రోజుల కంటే ఎక్కువ షూటింగ్ ఉండేది కాదు. బయట ఈవెంట్స్ ఇతరాత్రా వెళ్లిన ఆమెకు నెలలో పదిహేను రోజుల కంటే ఎక్కువ వర్క్ ఉండదు. అందుకే బిగ్ బాస్ షో ద్వారా ఎక్కువ సంపాదించాలని ఉద్దేశంతోనే పైమా వెళ్ళినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ షోలో పైమాకి వారానికి రెండున్నర లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పైమాకి సపోర్ట్ గా విపరీతమైన ట్రెండు నడుస్తోంది. దీంతో పైమా ఫైనల్ కు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఫైనల్లో రీచ్ అయితే భారీ మొత్తంలో నే ఆమె సంపాదించుకునే అవకాశం ఉంది. దీంతో పైమా బిగ్ బాస్ హౌస్ లో తన పెర్ఫార్మెన్స్తో అభిమానులు ఎలా ఆకర్షించాలి అనేది ఆలోచిస్తే బెటర్ అని చాలామంది అంటున్నారు.

జబర్దస్త్ లో ఉన్నటువంటి ఇమేజ్ ని ఆమె కంటిన్యూ చేస్తూ ఆ విధంగానే ఎంటర్టైన్మెంట్ చేస్తే కచ్చితంగా బిగ్ బాస్ లో గెలిచే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటి వరకు ఆమె బిగ్ బాస్ లో తన టాలెంట్ చూపించడం లేదని సమాచారం. మొదటి రెండు వారాల్లో వారి పర్ఫామెన్స్ బట్టి ఎవరు ఏ విధంగా ఉంటారు అనేది డిసైడ్ అవుతుంది. దీన్ని బట్టి ఎక్కువ మంది అభిమానులు ఆకర్షితులవుతారు. మరి పైమా ఏం చేస్తుందో మనం చూడాల్సిందే.

also read:ఈ క్యూట్ పాప టాలీవుడ్ లో నాటు హీరోయిన్ గా మారింది.. బాగా చూసి గుర్తుపట్టేయండి..!!

Visitors Are Also Reading