Home » దర్శకుడు వెంటపడినా.. బ్లాక్ బస్టర్ సినిమా ‘బాషా’ కు బాలయ్య ఎందుకు నో చెప్పారో తెలుసా!

దర్శకుడు వెంటపడినా.. బ్లాక్ బస్టర్ సినిమా ‘బాషా’ కు బాలయ్య ఎందుకు నో చెప్పారో తెలుసా!

by Bunty
Ad

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రజినీకాంత్.ఆర్టీసీ కండక్టర్ స్థాయి నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్ తన మేనరిజం, నటనతో స్టార్ హీరోగా మారిపోయారు. వరుస హిట్లు అందుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

Advertisement

రజనీకాంత్ మేనరిజంతో కాళ్లు, చేతులు తిప్పే స్టైల్ అంటే ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టం. ఇక రజనీకాంత్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ చిత్రాల్లో భాషా సినిమా కూడా ఒకటి. ఈ సినిమానే రజినీకాంత్ కు సౌత్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ముంబైని గడగడలాడించిన డాన్ ఆటో డ్రైవర్ గా ఎలా మారుతాడు.

Advertisement

ఎందుకు ఆటో డ్రైవర్ గా మారాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాను మొదట తమిళ్ లో తీశారు. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. తమిళ్లో భారీ విజయం సాధించిన ఈ సినిమాను నిర్మాతలు తెలుగులో కూడా చేయాలని అనుకున్నారు. కానీ సురేష్ కృష్ణ తెలుగులో సినిమాలు రీమేక్ చేయాలనుకున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని బాలకృష్ణ లేదా చిరంజీవిలతో రీమేక్ చేయాలని అనుకున్నారు.

ఈ నేపథ్యంలోనే పలువురు స్టార్స్ కోసం భాషా నిర్మాతలు దేవి శ్రీ థియేటర్ లో స్పెషల్ షో వేశారట. కానీ మన హీరోలకు ఈ సినిమా అంతగా నచ్చలేదట. ఇక బాలకృష్ణ రీమేక్ లకు దూరంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో భాషా సినిమాలో అవకాశం వచ్చినా లైట్ తీసుకున్నారు. ఒకవేళ బాలయ్య ఒప్పుకొని ఉంటే భాషా సినిమా నేరుగా తెలుగులో వచ్చి ఉండేది. మరి బాలయ్య భాషా చేసి ఉంటే ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

READ ALSO : నర్సుల దెబ్బకు దిగివచ్చిన బాలయ్య.. సోషల్ మీడియాలో పోస్ట్ !

Visitors Are Also Reading