Home » ఈ ఫొటోలో చీర పైకి ఎత్తడం వెనుక పెద్ద కథే ఉంది తెలుసా…?

ఈ ఫొటోలో చీర పైకి ఎత్తడం వెనుక పెద్ద కథే ఉంది తెలుసా…?

by Azhar
Ad

ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ అనేది ఇంకా మిగిలే ఉంది. అందుకే కొన్ని ప్రభుత్వాలు మళ్ళీ కరోనా ఆంక్షలను అమలు పరుస్తున్నాయి. ఇలా ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినట్లే మన దేశంలో చాలా రకాలైన వైరస్ లు గతంలో కూడా వచ్చాయి. వాటి కారణంగా చాలా మంది చనిపోయారు కూడా. అయితే ఇప్పుడు కరోనాకు మందు వచ్చిన తర్వాత దానిని తీసుకోవాలని ప్రభుత్వాలు నాయకులు టీవీలలో సోషల్ మీడియా వేదికగా తెగ చెప్పేస్తున్నారు.

Advertisement

కానీ గతంలో ఈ టెక్నాలజీ మనకు లేదు. అందువల్ల అప్పటి ఓ యువరాణి ఏం చేసిందో ఇప్పుడు మన తెలుసు కుందాం..! మన దేశాన్ని 19 వ దశాబ్దంలో బ్రిటిషర్లు పాలిస్తున్న సమయంలో మసూచి అనే మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తూ.. ప్రజలను పొట్టన పెట్టుకుంటుంది. దాంతో బ్రిటిషర్లు దీనికి టీకాను తెచ్చి వేసుకోమంటే.. ప్రజలు వెనుకడుగు వేసేవారు. ఎందుకంటే ఈ టీకా వేసుకుంటే ఇంకా ఏం జరుగుతుందో అనే భయం.

Advertisement

అయితే ఆ సమయంలో మైసూర్ ను పాలిస్తున్న మార్క్ విల్కేస్ కూడా తమ వాక్సిన్ తీసుకోవాలని కోరారు. కానీ ఫలితం లేదు. కానీ ఆ సమయంలో ఈ పై ఫొటోలో కుడివైపున ఉన్న దేవజమణి యువరాణితో మైసూర్ యువరాజు కు వివాహం ఖాయం అయ్యింది. అయితే తమ ప్రజలు మసూచి బారిన పడుతున్నారు అని.. ఆ యువరాణి బ్రిటీషర్ల వ్యాక్సిన్ ను తీసుకొని.. పై ఫోటోలు చూస్తున్నట్లు చేయి పైన ఉన్న చీరను పైకి ఎత్తి.. పేంటింగ్ వేయించి.. తాను వ్యాక్సిన్ తీసుకున్నాను అని ప్రజలకు తెలియజేసింది. దాంతో ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి వారు కూడా వ్యాక్సిన్ అనేది తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి :

సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ నుంచి కోహ్లీ ఔట్..?

సచిన్ కు సెంచరీ చేస్తే 50 కోట్లు వచ్చేవి.. ఎలాగో తెలుసా..?

Visitors Are Also Reading