Home » టీమిండియాకు బిగ్ షాక్.. ఆ మ్యాచ్ లకు కోహ్లీ దూరం..!

టీమిండియాకు బిగ్ షాక్.. ఆ మ్యాచ్ లకు కోహ్లీ దూరం..!

by Anji
Ad

ఇంగ్లాండుతో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా జనవరి 25న మొదటి మ్యాచ్ జరగనుండగా.. విరాట్  అభిమానులకు బీసీసీఐ బ్యాడ్ న్యూస్ చెప్పింది. వ్యక్తిగత కారణాల రిత్యా మొదటి రెండు టెస్టుల నుంచి కోహ్లీ వైదొలిగినట్లు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Advertisement

Advertisement

ఈ మేరకు ‘దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ తన మొదటి ప్రాధాన్యత అని విరాట్ చెప్పాడు. కానీ వ్యక్తిగత కారణాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లతో విరాట్ చర్చించాడు. అతడు తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం’ అని బీసీసీఐ  ట్వీట్ చేసింది. అలాగే బోర్డు, టీమ్ మేనేజ్‌మెంట్ స్టార్ బ్యాటర్‌కు మద్ధతుగా ఉంటాయని చెబుతూ.. ఈ సమయంలో విరాట్ కోహ్లీ గోప్యతను గౌరవించాలని, అతని వ్యక్తిగత కారణాలపై ఊహాగానాలు మానుకోవాలంటూ మీడియా, అభిమానులను కోరింది బీసీసీఐ.

 

కోహ్లీ గైర్హాజరుతో అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయనుండగా.. మొదటి టెస్టు మ్యాచ్‌ జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో రెండో టెస్ట్ మొదలవుతుంది. ఇక ఇప్పటికీ భారత్ తరఫున 113 టెస్టులు ఆడిన కోహ్లి 8,848 పరుగులతో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Visitors Are Also Reading