Home » Big boss 6: ఫైనల్ కి వెళ్ళేది ఎవరో చెప్పిన సూర్య..!!

Big boss 6: ఫైనల్ కి వెళ్ళేది ఎవరో చెప్పిన సూర్య..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఎంతో పేరు సంపాదించింది. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్బాస్ ఆరో సీజన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది.. అలాంటి బిగ్ బాస్ లో ఎప్పుడూ కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. వారం వారం ఆట తీరు మారుతూనే ఉంటుంది. మనం ఒకరు అనుకుంటే మరొకరు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు.. 55వ రోజున గీతు, ఫైమాను సున్నితంగా హెచ్చరించిన నాగార్జున, తన చేతికి వచ్చినటువంటి స్క్రోలు చూపిస్తూ సూర్యను ఎలిమినేట్ చేసినట్టుగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా హౌస్ లో ఉన్నవారు మరియు ప్రేక్షకులంతా షాక్ అయ్యారు..

Advertisement

alao read:బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ తో మెగాస్టార్ డిన్నర్..!

Advertisement

దీనికి కారణం హౌస్ లో చాలా వీక్ కంటెస్టెంట్లు ఇద్దరు ముగ్గురు ఉన్న సూర్య ఎలిమినేట్ కావడం.. ఈ తరుణంలో హౌసులో నుంచి బయటకు వచ్చిన సూర్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఎలిమినేట్ అయినప్పుడు షాక్ కాలేదు.. ఎందుకంటే ఏడు వారాలు గడిచిన తర్వాత నేను ఎప్పుడైనా సరే బయటకు వెళ్లొచ్చు అని ఉద్దేశంతోనే ఉన్నాను.. నేను ఉన్నన్ని రోజులు నా నుంచి ది బెస్ట్ ఇచ్చాను.. బెస్ట్ ఫీలింగ్ తోనే బయటకు వచ్చానని అన్నారు. బిగ్బాస్ హౌస్లో కొనసాగాలంటే లవ్ ట్రాక్ నడపాలి లేదంటే బయటకు వచ్చేస్తారు అనే మాటల్లో నిజం లేదు.. అందులో ఉండే వారికి ఎవరి పరిమితులు వారికి ఉంటాయి.

ఎంత క్లోజ్ గా ఉన్నా ఒకరినొకరు నామినేట్ చేసిన సందర్భాలు అనేకం ఉంటాయని చెప్పుకొచ్చారు.. అయితే నాకంటే ముందుగా బయటకు వచ్చేసిన చంటి ఎలిమినేషన్ జెన్యూన్ కాదని నాకు అనిపించింది. అసలు ఆయన ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం ఇప్పటికే అర్థం కావడం లేదు.. ఇక రేవంత్ విషయానికి వస్తే ఎప్పుడైనా ఓడిపోతే కాస్త ఉడుకుబోతు తనాన్ని చూపిస్తూ ఉంటారు. దాన్ని సరి చేసుకుంటే ఆయనను విన్నర్ గా చూసే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి రేవంతు, శ్రీహాన్, గీతు, పైమా, ఆదిరెడ్డి టాప్ ఫైవ్ లో ఉండవచ్చని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు ఆర్ జె సూర్య.

also read:

Visitors Are Also Reading