Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ తో మెగాస్టార్ డిన్నర్..!

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ తో మెగాస్టార్ డిన్నర్..!

by Anji
Ads

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గాడ్ ఫాదర్ సినిమా సూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. చిరంజీవి. తాజాగా చిరు ఓ ట్వీట్ వేశాడు. హైదరాబాద్ కి కొత్తగా వచ్చిన బ్రిటీష్ హై కమిషనర్ ను డిన్నర్ కి పిలిచాడట మెగాస్టార్. ఈ నేపథ్యంలో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. అతను కూడా మెగాస్టార్ తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతనికి తెలుగు సంప్రదాయ వంటకాలను రుచి చూపించాడు చిరంజీవి.

Advertisement

Ad

చిరంజీవి చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ లోని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో అంశాల గురించి మేము చర్చించుకున్నాం. తెలుగుకు ప్రతీకగా నిలిచే ఆవకాయ్ ని కూడా వడ్డించానని చిరు తెలిపాడు.  ఇండియా, బ్రిటన్ మధ్య సంబంధాలు తెలుగు రాష్ట్రాల అభివఈ ద్ధి ఇలా ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నామని చెప్పుకొచ్చారు చిరంజీవి. 

మరోవైపు డిప్యూటీ హై కమిషనర్ కూడా చిరు భేటీ పై ట్వీట్ చేశాడు. చిరంజీవిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. యూకే, టాలీవుడ్ ఇండస్ట్రీ, ఇండియా ఇలా చాలా అంశాల గురించి చర్చించుకున్నాం. ఇన్నేళ్లుగా ఆయన చేస్తున్న సామాజిక సేవలు, కార్యక్రమాలను ప్రశంసించాను. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాను. ముందు ముందు కూడా ఇలాంటి మీటింగ్స్ లో ఎన్నో అంశాలపై చర్చించుకోవాలని ట్వీట్ చేశాడు. చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా  సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Also Read :   Unstoppable season 2 episode 3 Promo : ప్రభాస్ పేరు చెప్పుకుని తిరుగుతుంటే.. నా పేరు చెబుతావా అంటున్న శర్వానంద్

Also Read : Ramba car accident: హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్..!!

Visitors Are Also Reading