Home » ఉమ్రాన్ వల్లే బ్యాటర్లు నన్ను ఉతుకుతున్నారు : భువీ

ఉమ్రాన్ వల్లే బ్యాటర్లు నన్ను ఉతుకుతున్నారు : భువీ

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు జైత్రయాత కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదట వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ఆరెంజ్ ఆర్మీ తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించింది. అయితే ఈ విజయాలలో సన్ రైజర్స్ యువ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కానీ తాజాగా భువనేశ్వర్ కుమార్ అతనిపై కీలక వ్యాఖ్యలు చేసాడు.

Advertisement

ఉమ్రాన్ వల్లే బ్యాటర్లు నా బౌలింగ్ లో ఉతుకుతున్నారు అని అన్నాడు. నిన్న పంజాబ్ తో మ్యాచ్ అనతరం భువీ మాట్లాడుతూ… ఉమ్రాన్ తమ జట్టుకు, తనకు బౌలింగ్ లో ఎలా ఉపయోగపడుతున్నాడు అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ… మాలిక్ జట్టుకు ఉపయోగపడుతున్నాడు కానీ.. నాకు కాదు. ఎందుకంటే.. అతను చాలా వేగంగా బౌలింగ్ చేస్తాడు. కాబట్టి అతని బౌలింగ్ లో బ్యాటర్లు రన్స్ చేయడం కష్టం అవుతుంది.

Advertisement

దాంతో అతడిని వదిలేసి.. నా బౌలింగ్ లో బౌండరీలు కొట్టాలి అనుకుంటున్నారు. ఎందుకంటే నేను ఉమ్రాన్ అంత వేగంగా బంతులు విసరలేను. కాబట్టి అతను నన్నే టార్గెట్ చేస్తున్నారు అని నవ్వుకుంటూ చెప్పాడు భువీ. ఇక ఈ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఉమ్రాన్ చివరి ఓవర్ ను మేడిన్ చేయడమే కాకుండా.. 3 కూడా తీసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో కరోనా గందరగోళం..!

ఐపీఎల్ లో కేన్ మామ సరికొత్త రికార్డు…!

Visitors Are Also Reading